Emmanuel Macron: మరికాసేపట్లో భారత్ లో అడుగుపెట్టనున్న ఫ్రెంచ్ అధ్యక్షుడు, రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొననున్న ఆరో ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రన్
ఆయనకు ప్రధాని మోదీ (PM Modi) ఘనంగా స్వాగతం పలుకనున్నారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి జైపూర్‌లో ర్యాలీ నిర్వహించనున్నారు. అదేవిధంగా పింక్ సిటీలో పలు పర్యాటక ప్రవేశాలను సందర్శిస్తారు.
New Delhi, JAN 25: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) హాజరవుతున్నారు. ఇందులో భాగంగా నేడు భారత్ చేరుకోనున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్ (Jaipur) విమానాశ్రయంలో ఫ్రెంచ్ అధినేత దిగనున్నారు. ఆయనకు ప్రధాని మోదీ (PM Modi) ఘనంగా స్వాగతం పలుకనున్నారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి జైపూర్‌లో ర్యాలీ నిర్వహించనున్నారు. అదేవిధంగా పింక్ సిటీలో పలు పర్యాటక ప్రవేశాలను సందర్శిస్తారు. గురువారం రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు. గణతంత్ర వేడుకల తర్వాత రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమంలో పాల్గొంటారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్ వస్తున్న ఆరో అధ్యక్షుడిగా మాక్రాన్ నిలవనున్నారు. గతంలో ఫ్రెంచ్ అధ్యక్షులు ఫ్రాంకోయిస్ హోలాండ్ (2016), నికోలస్ సర్కోజీ (2008), జాక్వెస్ చిరాక్ (1998), వాలెరీ గిస్కార్డ్ డి ఎస్టేయింగ్ (1980)లు దేశానికి వచ్చానికి. కాగా, మాక్రాన్ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌తో పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. ముఖ్యంగా రక్షణ, భద్రత, క్లీన్ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త సాంకేతికతోపాటు ఇతర రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరుగనున్నట్లు తెలుస్తున్నది.