G-20 in India: ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించిన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఎజెండాలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు ఏంటంటే..
భారతదేశంలో G-20: ఢిల్లీలో G-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, US అధ్యక్షుడు జో బిడెన్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలపై వారిద్దరూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
New Delhi, Sep 8: భారతదేశంలో G-20: ఢిల్లీలో G-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, US అధ్యక్షుడు జో బిడెన్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలపై వారిద్దరూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. భారతదేశంలో జెట్ ఇంజిన్‌లను సంయుక్తంగా తయారు చేసే ఒప్పందంపై పురోగతి, MQ-9B సాయుధ డ్రోన్‌ల కొనుగోలు, పౌర అణు బాధ్యత, వాణిజ్యంపై ఒప్పందం.. ప్రధాని, యూఎస్ అధ్యక్షుడు జోబైడెన్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్న ఎజెండాలో ప్రధాన అంశాలుగా ఉన్నట్లు సమాచారం.
క్లీన్ ఎనర్జీ, ట్రేడ్, హైటెక్నాలజీ, డిఫెన్స్ రంగాల్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించనున్నారు. అలాగే ఇరు దేశాల మధ్య మరింత ఉదారమైన వీసా పాలసీ ఉండాలని మోదీ, జో బైడెన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.