Anti-Cancer Drugs Price Cut: క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మూడు ఓౌషధాల ధరలు తగ్గింపు, కేంద్రం కీలక ఆదేశాలు
ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి ఊరట నిచ్చేలా కీలక ఆదేశాలు జారీ చేసింది. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మూడు ప్రధాన ఔషధాల ఎంఆర్‌పీ (MRP) ధరలను తగ్గించింది
క్యాన్సర్ రోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి ఊరట నిచ్చేలా కీలక ఆదేశాలు జారీ చేసింది. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మూడు ప్రధాన ఔషధాల ఎంఆర్‌పీ (MRP) ధరలను తగ్గించింది. ఈ మేరకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) మూడు క్యాన్సర్ నిరోధక ఔషధాల ధరలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చికిత్సలో వాడే ట్రాస్టూజుమాబ్, ఒసిమెర్టినిబ్, దుర్వాలుమాబ్ అనే మందుల ధరలు తగ్గనున్నాయి.
సామాన్య ప్రజలకు సైతం వాటిని సరసమైన ధరలకు అందించాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ సర్కార్ తెలిపింది. ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్ 2024-25లోనే వీటికి కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన రెవెన్యూ విభాగం ఈ మూడు మందులపై కస్టమ్స్ డ్యూటీని రద్దు చేసింది. అలాగే జీఎస్టీ రేటు 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ఈ మేరకు ఎంఆర్‌పీని తగ్గించాలని తయారీదారులను ఎన్‌పీపీఏ ఆదేశించింది. ధరల మార్పు గురించి డీలర్లు, రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్లు, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలని సూచించింది.