Uttarakhand: ఏడాది లోపు మనవడిని ఇవ్వండి, లేదా రూ. 5 కోట్లు నష్ట పరిహారం చెల్లించండి, కోర్టులో పిటిషన్ వేసిన ఓ కొడుకు తల్లి
ఏడాదిలోగా మనవడిని లేదా మనవరాలిని తన చేతిలో పెట్టకపోతే రూ.5కోట్లు ఇవ్వండి (Grandchild within a year or Rs 5 crore) అంటూ కొడుకు కోడలికి తల్లి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
Haridwar, May 13: సివిల్ కోర్టుకెక్కిన కేసుల్లో ఆసక్తికర కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏడాదిలోగా మనవడిని లేదా మనవరాలిని తన చేతిలో పెట్టకపోతే రూ.5కోట్లు ఇవ్వండి (Grandchild within a year or Rs 5 crore) అంటూ కొడుకు కోడలికి తల్లి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పైగా తన వార్నింగ్ ను హైకోర్టు (Broke parents move court) ద్వారా ఇప్పించారని ఆ తల్లి తరపు లాయర్ ఏకే శ్రీవాస్తవ వెల్లడించారు.
ఆమె పిటిషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం... కొడుకు చదువు కోసం తాను బాగా డబ్బు వెచ్చించానని, సక్సెస్‌ఫుల్ పైలట్ గా తీర్చిదిద్దానని చెప్పారు. 2016లో కొడుకు కోసం చాలా ఖర్చు పెట్టి పెళ్లి చేయడంతో పాటు, హనీమూన్ కోసం థాయ్‌లాండ్ పంపించడానికి తన సొంతడబ్బు చాలా ఖర్చు పెట్టానని చెప్పారు. పెళ్లి తర్వాత, కోడలు తన కొడుకును ఫ్యామిలీని హైదరాబాద్‌కు మార్చమని బలవంతం చేసిందని, అప్పటి నుండి ఆ కుటుంబం తనతో మాట్లాడటం లేదని తల్లి వాపోయింది. తన కొడుకు జీతంపై ఆమె కోడలు పూర్తి నియంత్రణను తీసుకుంటుందని దావాలో ఆరోపించింది.
ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ.. కొడుకు, కోడలు ఏడాదిలోపు బిడ్డను కనేలా ఆదేశించాలని, లేకుంటే తల్లిదండ్రులకు రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆ పిటిషన్‌లో కోరారు.