Bulldozer Baraat: బుల్డోజర్‌ లో పెళ్లి ఊరేగింపు, యోగి ఇలాఖాలో ముస్లిం యువకుడి వినూత్న ఊరేగింపు, అనుబంధాలు పెంచుకునేందుకు కూడా బుల్డోజర్ పనికొస్తుందంటూ సందేశం

శనివారం బహ్రాయీచ్ జిల్లాలో ఈ వినూత్న వేడుక జరిగింది. బాద్షా-రుబీనా వివాహం ఘనంగా జరిగింది. అయితే పెళ్లి బరాత్ (marriage Baraat)​లో బుల్డోజర్​ను ఉపయోగించి అందరినీ ఆశ్చర్య పర్చారు.

Lucknow, June 19: దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తున్న పదం ‘బుల్డోజర్’(Bulldozer). ముఖ్యంగా ఉత్తర్​ప్రదేశ్​లో ‘బుల్డోజర్’(Bulldozer) అనే మాట ప్రతిరోజూ వినిపిస్తుంది. రాష్ట్రంలో యోగి (Yogi)ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత బుల్డోజర్ కు (Bulldozer) ప్రాధాన్యత ఏర్పడింది. అక్రమ కట్టడాలను కూల్చివేయడంలో బుల్డోజర్ ను వినియోగిస్తూ అక్రమార్కుల గుండెల్లో యోగి రైళ్లు పరుగెత్తిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మళ్లీ ఆ రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించడంతో సీఎంగా యోగి బాధ్యతలు చేపట్టారు. దీంతో బీజేపీ బుల్డోజర్ అనే పదాన్ని దేశవ్యాప్తంగా ఉపయోగిస్తుంది. అయితే నేరస్థుల ఇళ్లను ప్రభుత్వాలు కూల్చేయడానికే పరిమితం అనుకుంటే పొరపాటే.. ఓ ముస్లిం జంట (Muslim Couple) వివాహ వేడుకలోనూ బుల్డోజర్ కనిపించింది. శనివారం బహ్రాయీచ్ జిల్లాలో ఈ వినూత్న వేడుక జరిగింది. బాద్షా-రుబీనా వివాహం ఘనంగా జరిగింది. అయితే పెళ్లి బరాత్ (marriage Baraat)​లో బుల్డోజర్​ను ఉపయోగించి అందరినీ ఆశ్చర్య పర్చారు.

బాద్షాను కుటుంబ సభ్యులు అందంగా అలంకరించిన బుల్డోజర్​పై ఊరేగించారు. దీన్ని చూసి స్థానికులు ‘బుల్డోజర్ బాబాకీ జై’అంటూ నినాదాలు చేశారు. దీంతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే .. ‘బుల్డోర్ బారాత్’ లక్ష్మణ్‌పూర్-శంకర్‌పూర్ గ్రామానికి వచ్చినప్పుడు, దాదాపు గ్రామం మొత్తం సెల్ఫీ తీసుకోవడానికి వేదిక వద్దకు పరుగెత్తారు. వరుడితో కాదు.. అతను వచ్చిన అలంకరించిన బుల్‌డోజర్‌తో సెల్పీలు దిగారు.

Agneepth Scheme: ఇకపై ఆర్మీలో రెగ్యులర్ నియామకాలు ఉండవు! అగ్నిపథ్ స్కీమ్ పై ఉన్నతాధికారుల క్లారిటీ, ఆందోళనల్లో పాల్గొంటే ఉద్యోగాలు రావు, అగ్నిపథ్ స్కీమ్ బెనిఫిట్స్ వివరించిన త్రివిధ దళాల అధికారులు  

ఈ విషయంపై పెళ్లి పెద్దలు మాట్లాడుతూ.. బాద్షా-రుబీనా వివాహాన్ని గుర్తుండిపోయేలా చేసేందుకు ఇలా బుల్డోజర్​ను ఉపయోగించినట్లు తెలిపారు. ఇదిలాఉంటే ఈ ఘటనపై బహ్రాయీచ్ సదర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ నేత అనుపమా జయస్​వాల్ స్పందించారు. రాష్ట్రంలో సుపరిపాలనకు బుల్డోజర్ చిహ్నంలా మారిందని పేర్కొన్నారు. బుల్డోజర్​ను చూసి నేరస్థులే భయపడుతున్నారని అన్నారు.

Agnipath Protest: అగ్నిపథ్ ఆందోళనల దెబ్బతో దేశంలోని అన్ని BJP రాష్ట్ర కార్యాలయాల వద్ద భద్రత పెంపు, బీహార్ బీజేపీ నేతలకు 'వై' కేటగిరీ భద్రత కల్పించిన కేంద్ర హోం శాఖ...  

పెళ్లి కొడుకు ఈ విషయంపై మాట్లాడుతూ.. నేను నా వివాహాన్ని ఒక చిరస్మరణీయ సంఘటనగా మార్చాలనుకున్నా, ఈ ఆలోచన కూడా భిన్నంగా ఉంటుందని నేను అనుకున్నానని చెప్పాడు. ఇప్పుడు బుల్డోజర్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif