Surat Chemical Factory Fire: సూరత్‌ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం, మంటల్లో సజీవ దహనమైన ఏడుగురు కూలీలు, మరో 27 మందికి గాయాలు

ఈ ఘటనలో ఏడుగురు కూలీలు మృతి చెందారు. మరో 27 మంది గాయాలపాలయ్యారు. ఈథర్ రసాయనం తయారు చేయు పరిశ్రమలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Fire Representational Image (Photo Credit: Pixabay)

Gujarat Chemical Factory Fire: గుజరాత్‌లోని సూరత్‌లో గల ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు మృతి చెందారు. మరో 27 మంది గాయాలపాలయ్యారు. ఈథర్ రసాయనం తయారు చేయు పరిశ్రమలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

బుధవారం తెల్లవారుజామున ఇండస్ట్రీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణ్లాలోనే అగ్ని కీలలు ఫ్లోర్‌ అంతా వ్యాపించాయి. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు అదృశ్యమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా ఏడుగురు కార్మికుల మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు.

శంషాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం, థర్మాకోల్ కంపెనీలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగలు

అగ్ని ప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతానికి తెలియదు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 1.3 మిలియన్ డాలర్ల ఆస్తి నష్టం సంభవించినట్లు పరిశ్రమ యజమాని అశ్విన్ దేశాయ్ తెలిపారు.