Ahmedabad Shocker: మ‌ధ్యాహ్నం పూట సెక్స్ కోరిక తీర్చలేదని భార్యను బెల్టుతో చితకబాదిన ఖాకీ భర్త, అలసిపోయానని భార్య చెప్పినా వినకుండా దాడి, గృహ హింస కేసు న‌మోదు చేసిన పోలీసులు

శారీర‌కంగా క‌లిసేందుకు నిరాక‌రించింద‌నే కోపంతో భార్య‌(32)ను బెల్టుతో కొట్టి చిత్ర‌హింస‌ల‌కు (Cop flogs wife with belt) గురిచేశాడు ఓ కామాంధుడైన ఖాకీ భర్త. గ‌

Rape | Representational Image (Photo Credits: Pixabay)

Ahmedabad, Mar 1: గుజరాత్ రాష్ట్రంలోని అహమ్మదాబాద్ నగరంలో దారుణం (Ahmedabad Shocker) చోటు చేసుకుంది. శారీర‌కంగా క‌లిసేందుకు నిరాక‌రించింద‌నే కోపంతో భార్య‌(32)ను బెల్టుతో కొట్టి చిత్ర‌హింస‌ల‌కు (Cop flogs wife with belt) గురిచేశాడు ఓ కామాంధుడైన ఖాకీ భర్త. గ‌త నెల‌లో భ‌ర్త త‌న‌ను తీవ్రంగా వేధించ‌డంతో పాటు ఇంటి నుంచి త‌రిమివేశాడ‌ని బాధిత మ‌హిళ ఫిర్యాదు చేసింది. ప‌టాన్‌లో పోలీస్ కానిస్టేబుల్‌గా ప‌నిచేసే భ‌ర్త‌పై మ‌హిళ ఫిర్యాదు ఆధారంగా అతనిపై గృహ హింస కేసు న‌మోదైంది. ప్రముఖ డ్యాన్సర్‌పై 11 మంది గ్యాంగ్ రేప్, మత్తు మందు ఇచ్చి కోరిక తీర్చుకున్న కామాంధులు, యూపీలో దారుణ ఘటన

2012లో తాము పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా నిందితుడితో ప‌రిచ‌య‌మైంద‌ని ఆమె త‌న ఫిర్యాదులో వివ‌రించింది. ఆపై తామిద్దరం ప్రేమలో ప‌డి ఆపై వివాహం చేసుకున్నామ‌ని తెలిపింది. 2014లో వివాహ‌మైన త‌ర్వాత క‌చ్‌లో కాపురం పెట్టామ‌ని వెల్ల‌డించింది. తాను ఎలాంటి క‌ట్నం తీసుకురాక‌పోవ‌డంతో అత్తింటి వారు వేధించేవార‌ని తెలిపింది. ప‌టాన్‌కు భ‌ర్త బ‌దిలీ కావ‌డంతో అదే ప్రాంతంలో భ‌ర్త‌తో క‌లిసి ఉంటోంది.

యూపీలో దారుణం, మొబైల్ ఛాటింగ్ చేస్తుందని భార్యకు ఉరివేసి చంపేసాడు, ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు

ఒక‌రోజు మ‌ధ్యాహ్న స‌మ‌యంలో ఇంటికి వ‌చ్చిన భ‌ర్త కోరిక తీర్చాల‌ని ప‌ట్టుబ‌ట్టాడ‌ని తాను అలిసిపోయాన‌ని నిరాక‌రించ‌డంతో బెల్టుతో (Husband abandons, tortures wife with belt ) విప‌రీతంగా కొట్ట‌డంతో స్ప్ర‌హ కోల్పోయాన‌ని ఆమె తెలిపింది. ఆపై రాత్రంతా త‌న‌ను ఇంటి బ‌య‌ట నిల‌బెట్టాడ‌ని బ‌ల‌వంతంగా ఇంటి నుంచి గెంటేశాడ‌ని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.



సంబంధిత వార్తలు