Gujarat: అనాథ యువతిపై కామాంధుడి కన్ను, చేరదీస్తానంటూ భార్య ముందే పలుమార్లు లైంగిక దాడి, ఈ దారుణానికి సహకరించిన అతడి భార్య, దంపతులకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన అహమ్మదాబాద్ సిటీ సెష‌న్స్ కోర్టు

కట్టుకున్న భార్య స‌హ‌కారంతో నిందితుడు బాబుభాయ్ వెగ్ధా 18 ఏళ్ళ బాలిక‌పై ప‌లుమార్లు లైంగిక దాడుల‌కు (10 years in jail in rape case) పాల్ప‌డ్డాడు.

Representational Image. | (Photo Credits: Pixabay)

Ahmedabad, Feb 22: గుజరాత్ రాష్ట్రంలో 18 ఏండ్ల యువతిపై ప‌లుమార్లు లైంగిక దాడికి పాల్ప‌డిన కేసులో దంప‌తుల‌కు సిటీ సెష‌న్స్ కోర్టు ప‌దేండ్ల జైలు శిక్ష ( Man, wife awarded 10 years) విధించింది. కట్టుకున్న భార్య స‌హ‌కారంతో నిందితుడు బాబుభాయ్ వెగ్ధా 18 ఏళ్ళ యువతిపై ప‌లుమార్లు లైంగిక దాడుల‌కు (10 years in jail in rape case) పాల్ప‌డ్డాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో అనాధాశ్ర‌మంలో పెరిగిన బాలిక 18 ఏండ్లు రాగానే అమ్మ‌మ్మ వ‌ద్దకు నివ‌సిస్తోంది. 2018లో యువతిని తాము హాస్ట‌ల్‌లో చేర్పిస్తామ‌ని త‌మ‌తో పంపాల‌ని కుటుంబ‌స‌భ్యుల‌ను నిందితుడు కోరాడు.

ఆ మాయమాటలను నమ్మిన అమ్మమ్మ ఆ బాలికను వారితో పంపించింది. అయితే ఆపై బాలిక‌ను హాస్ట‌ల్‌లో చేర్పించ‌కుండా ఆ దంపతులు నిర్బంధించారు. బాలిక‌ను గుడిలోకి తీసుకువెళ్లిన నిందితుడు ఆమెను పెండ్లి చేసుకున్నాడు. నిందితుడు బాబుభాయ్ ఇరుగుపొరుగు వారికి బాలిక‌ను త‌న భార్య‌గా ప‌రిచ‌యం చేశాడ‌ని బాధితురాలు పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మ‌రోవైపు నిందితుడి భార్య మ‌ధువ‌ని బాలిక‌ను త‌న కోడ‌లిగా స్దానికుల‌కు ప‌రిచ‌యం చేసింది. బాబుభాయ్ ప‌లుమార్లు త‌న‌ను బెదిరించి భార్య సహ‌కారంతో లైంగిక దాడుల‌కు పాల్ప‌డ్డాడ‌ని ఫిర్యాదులో ఆరోపించింది.

దారుణం.. భర్తను 140 సార్లు కత్తితో పొడిచి చంపిన భార్య, అంతటితో ఆగక అతని పుర్రెను ముక్కలు ముక్కలు చేసింది, కొడుకు ఫిర్యాదుతో నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు, అమెరికాలోని ఫ్లోరిడాలో భయానక ఘటన

నిందితుడు బాలిక‌ను అక్ర‌మంగా నిర్భంధించాడ‌ని, స్ధానికుల ఎదుట బాలిక గురించి త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. బాధితురాలితో ప‌ర‌స్ప‌ర అంగీకారంతో కాకుండా నిందితుడు భార్య స‌హ‌కారంతో బ‌ల‌వంతంగా సంబంధం కొన‌సాగించాడ‌ని వెల్ల‌డ‌వుతోంద‌ని పేర్కొంది. గుజ‌రాత్ బాధిత ప‌రిహార ప‌ధ‌కం కింద రెండు నెల‌ల్లోగా బాధితురాలికి ప‌రిహారం చెల్లించాల‌ని కోర్టు ఆదేశించింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif