Gujarat Coronavirus: వ్యాక్సిన్ తీసుకున్న తరువాత మంత్రికి, వైద్యునికి కరోనా, కోవిడ్ కల్లోలంతో నైట్ కర్ఫ్యూ విధించిన గుజరాత్, మార్చి 17 నుండి మార్చి 31 వరకు కర్ఫ్యూ అమల్లోకి

ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈశ్వర్ సింగ్ యూఎన్ మెహతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Gujarat Minister Ishwarsinh Patel (Photo Credits: Twitter)

Gandhinagar, March 16: దేశంలో కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. అన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టాయి. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా కరోనా వస్తున్న సంఘటనలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. తాజాగా వ్యాక్సిన్ (COVID-19 Vaccine) తీసుకున్న తరువాత గుజరాత్ క్రీడాశాఖ మంత్రి ఈశ్వర్ సింగ్ పటేల్ (Gujarat Minister Ishwarsinh Patel) కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈశ్వర్ సింగ్ యూఎన్ మెహతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈశ్వర్ సింగ్ మార్చి 13న కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినా కూడా అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. కాగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 3,29,47,432 మందికి కరోనా టీకాలు వేశారు. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, గుజరాత్, తమిళనాడులలో కోవిడ్-19 కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసులలో 78.41 కేసులు ఈ రాష్ట్రాలలోనే ఉన్నాయి.

కరోనావైరస్ కేసులు ఇటీవల పెరగడం దృష్ట్యా, గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలోని అహ్మదాబాద్, వడోదర, సూరత్ మరియు రాజ్కోట్ నాలుగు మెట్రో నగరాలలో నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నాలుగు నగరాలు మార్చి 17 నుండి రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల మధ్య రాత్రి కర్ఫ్యూను పాటించనున్నాయి. ఇది మార్చి 31 వరకు కొనసాగుతుంది.

Here's Gujarat Minister Ishwarsinh Patel Tweets:

కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య వచ్చే మూడు టి 20 మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండా ఆడతాయని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జిసిఎ) సోమవారం తెలిపింది. సోమవారం, అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కూడా నగరంలోని ఎనిమిది వార్డులలోని తినుబండారాలు, రెస్టారెంట్లు మరియు మాల్‌లను రాత్రి 10 గంటలకు మూసివేయమని కోరింది.

ఇండియాలో సెకండ్ వేవ్, దేశంలో తాజాగా 24,492 మందికి కరోనా నిర్ధారణ, సెకండ్ వేవ్‌పై మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన కేంద్రం, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 17న సీఎంలతో వర్చువల్ సమావేశం కానున్న ప్రధాని మోదీ

గుజరాత్‌లో సోమవారం కొత్తగా 890 కోవిడ్ 19 కేసులు (Gujarat Coronavirus) నమోదయ్యాయి, వీటి సంఖ్య 2,79,097 గా ఉంది. గత నెలలో రాష్ట్రంలో ప్రతిరోజూ 200 కొత్త కేసులు నమోదవుతున్నాయి. అధికారిక డేటా ప్రకారం సూరత్, అహ్మదాబాద్, వడోదర మరియు రాజ్కోట్ లలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.

ఇక హిమాచల్‌ప్రదేశ్ రాజధాని షిమ్లాలోని దీన్‌దయాల్ ఉపాధ్యాయ హాస్పిటల్లో పని చేస్తున్న ఓ వైద్యుడు రెండో మోతాదారుల వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కరోనా వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారు. ఆయనతో పాటు ఆయన భార్య, కూతురు సైతం సోమవారం మహమ్మారి బారినపడ్డారు. రెండో డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా వైద్యుడికి కొవిడ్‌ సోకడంతో సిబ్బంది అందరూ ఆందోళనకు గురవుతున్నారు. డాక్టర్‌ సిబ్బందిని కలువడంతో వైరస్‌కు తమకూ సోకుతుందేమోనని భయపడుతున్నారు.

గబ్బిలాల నుండే కరోనావైరస్ వ్యాపిస్తోంది, సార్స్-కోవ్-2 వైరస్‌‌లో అనేక జన్యు రూపాలు, సంచలన విషయాలను వెల్లడించిన స్కాట్లాండ్‌లోని గ్లాస్గో యూనివర్సీటీ ఫర్‌ వైరస్‌ రీసెర్చ్‌ టీం

జ్వరం రావడంతో వైద్యుడు భార్య, కుమార్తెను సోమవారం హాస్పిటల్‌కు తరలించారు. వారితో పాటు వైద్యుడికి పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు రావాల్సి ఉంది. వైద్యుడు నాలుగు రోజుల కిందట రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. వైద్యుడు జనవరి 30న వ్యాక్సిన్‌ మొదటి, మార్చి 1న రెండో డోసు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను ఐసోలేషన్‌లో ఉండాలని హాస్పిటల్‌ ఉన్నతాధికారులు సూచించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif