Vadodara Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, 11 మంది మృతి..17 మందికి పైగా తీవ్ర గాయాలు, గుజరాత్ వడోదర వద్ద వాఘోడియా క్రాస్‌రోడ్డు సమీపంలో ఉన్న వంతెనపై ఘటన
గుజరాత్‌లోని వడోదర వద్ద జరిగిన ప్రమాదంలో కనీసం 11 మంది మృతి చెందగా, 17 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వడోదర వద్ద వాఘోడియా క్రాస్‌రోడ్డు సమీపంలో డంపర్ ట్రక్కు మరియు మరొక వాహనం ఢీ కొన్నాయి. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు వడోదర వద్ద వాఘోడియా క్రాస్‌రోడ్డు సమీపంలో ఉన్న వంతెనపై ఈ ప్రమాదం జరిగింది.
Gujarat, November 18: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుజరాత్‌లోని వడోదర వద్ద జరిగిన ప్రమాదంలో కనీసం 11 మంది మృతి చెందగా, 17 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వడోదర వద్ద వాఘోడియా క్రాస్‌రోడ్డు సమీపంలో డంపర్ ట్రక్కు మరియు మరొక వాహనం ఢీ కొన్నాయి. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు వడోదర వద్ద వాఘోడియా క్రాస్‌రోడ్డు సమీపంలో ఉన్న వంతెనపై ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదం హైవేపై భారీ ట్రాఫిక్ జామ్‌కు దారితీసింది. మృతులను, తీవ్రంగా గాయపడిన వారిని వడోదరలోని సయాజీ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఒక చిన్న పిల్లాడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Here's ANI Tweet
ఇక యూపీలో ఓ ప్రైవేటు ప్యాసింజర్ బస్సు లారీని ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మరణించగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ లో జరిగింది. ఢిల్లీ-లక్నో జాతీయ రహదారిపై ముందాపాండే ప్రాంతం వద్ద వేగంగా వస్తున్న లారీ ఓ ప్రైవేటు బస్సును ఢీకొట్టింది.
ఈ ప్రమాద ఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. బీహార్ నుంచి పంజాబ్ రాష్ట్రానికి బస్సు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేపిస్తున్నామని ఎస్పీ అమిత్ కుమార్ ఆనంద్ చెప్పారు. రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు చెప్పారు.