Gujarat Shocker: వివాహేతర సంబంధంలో ఉన్న ప్రియుడి ఫోన్ చూసి షాకైన ప్రియురాలు, తట్టుకోలేక ఆత్మాహత్యా ప్రయత్నం

గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 27 ఏళ్ల యువతి వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడిపై మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Police vehicle (Photo Credit: Pixabay)

గాంధీనగర్, ఫిబ్రవరి 19: గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 27 ఏళ్ల యువతి వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడిపై మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. నిషా ప్రజాపతి అనే యువతి తన మూడేళ్ల చిన్నారితో కలిసి గోదార పరిసరాల్లో నివాసం ఉంటోంది. 2021లో విడాకులు తీసుకున్న ఆమె ఆ ప్రాంతంలో అద్దె ఇంటిలో నివసిస్తోంది. ఇక మూడేళ్ల క్రితం ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ భరత్ అనే యువకుడి ప్రేమాయణం సాగించాడు. ఇద్దరూ కలిసి వివాహేతర సంబంధం పెట్టుకుని జీవిస్తున్నారు.

కిరానా సామాన్లు కొనేందుకు బైక్‌పై వెళ్తుండగా యువకుడికి గుండెపోటు, కుప్పకూలి రోడ్డు మీదనే మృతి చెందిన బైకర్

అయితే ఫిబ్రవరి 12న బరత్ ఫోన్‌ చూడగా ( Live-in Partner’s Mobile Phone) అతని భార్యతో కాంటాక్ట్‌లో ఉన్నట్లు నిషా గుర్తించింది. దీనిపై అతన్ని నిలదీయడంతో అతను హత్య చేస్తానని బెదిరించి ఇంట్లో నుంచి పారిపోయాడు.తన భార్య దగ్గరకు వెళ్లాడని తెలుసుకున్న నిషాపతి ఆత్మహత్యకు (Woman Attempts Suicide ) ప్రయత్నించింది. ఆమె తన బిడ్డను చూసుకోమని తన సోదరుడికి ఫోన్ చేసి స్లీపింగ్ ట్యాబ్లెట్లు మింగింది. సోదరుడు ఆమె ఉన్న ఇంటికి వచ్చి వెంటనే ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స నుంచి కోలుకున్న తరువాత ప్రియుడిపై క్రిమినల్ బెదిరింపు, నమ్మకాన్ని ఉల్లంఘించినట్లు ఫిర్యాదు చేసింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement