Gurugram Fire: క్షణాల్లో కాలి బూడిద..హర్యానాలో అగ్నికి ఆహుతైన 700 గుడిసెలు, రోడ్డు మీద పడిన వందల కుటుంబాలు, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందనే అనుమానాలు
ఒక గుడిసెలో చెలరేగిన మంటలు కొన్ని నిమిషాల వ్యవధిలో మురికివాడంతా (Gurugram Fire) వ్యాపించాయి. దీంతో ఆ వాడలో ఉన్న 700 గుడిసెలు అగ్నికి (700 Huts Gutted In Shocking Fire Accident) ఆహుతయ్యాయి. అయితే ఈ ప్రమాదం నుంచి బస్తీవాసులు తృటిలో తప్పించుకున్నారు.
Gurugram, April 3: హర్యానాలోని గురుగ్రామ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక గుడిసెలో చెలరేగిన మంటలు కొన్ని నిమిషాల వ్యవధిలో మురికివాడంతా (Gurugram Fire) వ్యాపించాయి. దీంతో ఆ వాడలో ఉన్న 700 గుడిసెలు అగ్నికి (700 Huts Gutted In Shocking Fire Accident) ఆహుతయ్యాయి. అయితే ఈ ప్రమాదం నుంచి బస్తీవాసులు తృటిలో తప్పించుకున్నారు. ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. కాకపోతే వారి నిత్యావసరాలు.. సామగ్రి, దాచుకున్న సొమ్మంతా బుగ్గిపాలయ్యాయి. దీంతో వారంతా రోడ్డుపై పడ్డారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
హరియాణాలోని గుర్గావ్ సమీపంలో ఉన్న నాథూపుర మురికివాడలో శనివారం తెల్లవారుజామున ఓ పూరి గుడిసెలో మంటలు వ్యాపించాయి. వాటిని ఆర్పేలోపు పక్కనే ఉన్న మరో గుడిసెకు ఆ విధంగా గుడిసె గుడిసెకు అంటుకుంటూ ఏకంగా 700 గుడిసెలు మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో గుడివాసులు వాటికి దూరంగా వచ్చారు.
Here's Fire Video
ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలు ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దాదాపు 15 ఫైరింజన్ల సాయంతో 5 గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. గంటన్నర పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగినప్పటికీ.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. గుడిసెలు దగ్దం కావడంతో చాలా ఏళ్లుగా గుడిసెల్లో జీవిస్తున్న వారి జీవితాలు రోడ్డున పడ్డాయి.
అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటో తెలియడం లేదు. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.