28 Years Man Loves 67 Years Woman:సెక్స్ లేకపోతే మేమిద్దరం బ్రతకలేం, ఆమెకు 67, అతనికి 28, ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు, సహజీవనం కోసం కోర్టు మెట్లెక్కారు, మమ్మల్ని గుర్తించండి అంటూ మొరపెట్టుకున్న జంట
కొంతకాలంగా కలిసి ఉంటున్నారు. రెండు జనరేషన్ల మధ్య పుట్టిన ప్రేమను అలాగే నిలబెట్టుకోవాలని తపన పడుతుంది ఆ జంట. ఇందుకోసం కోర్టుమెట్లు ఎక్కి సంచలనంగా మారారు. అయితే తమ ప్రేమను జీవితమంతా అనుభవిస్తాము.. కానీ పెళ్ళి మాత్రం చెసుకొము అని చెబుతున్నారు.
Gwalior, March 25: ప్రేమకు (Love)కులం, మతం, జాతి, రంగులాంటి అడ్డుగోడలు ఉండవని తెలుసు, కానీ మధ్యప్రదేశ్ (Madhya pradesh) కు చెందిన ఓ జంట మాత్రం తమకు వయస్సు బేధం కూడా లేదంటోంది. వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ (Love) ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే... 67 ఏళ్ల మహిళ, 28 ఏళ్ల యువకుడు ప్రేమించుకున్నారు. కొంతకాలంగా కలిసి ఉంటున్నారు. రెండు జనరేషన్ల మధ్య పుట్టిన ప్రేమను అలాగే నిలబెట్టుకోవాలని తపన పడుతుంది ఆ జంట. ఇందుకోసం కోర్టుమెట్లు ఎక్కి సంచలనంగా మారారు. అయితే తమ ప్రేమను జీవితమంతా అనుభవిస్తాము.. కానీ పెళ్ళి మాత్రం చెసుకొము అని చెబుతున్నారు. వారి ప్రేమను అంగీకరించాలని కోర్టును కోరారు. దాంతో ఇది సంచలనంగా మారింది. ప్రేమ తమకు వయస్సును గుర్తు చెయలేదని, కేవలం మనసు మాత్రమే మాకు ముఖ్యం అని ఆ జంట అంటున్నారు. మా ప్రేమకు కేవలం నెంబరు మాత్రమే తేడా అని తెల్చి చెప్పారు..రిలేషన్ లో ఉంటాము కానీ పెళ్ళి చేసుకోబోము అని తేల్చి చెప్పారు.
విషయానికొస్తే.. మధ్యప్రదేశ్‌కు చెందిన 67ఏళ్ల రాంకాలి (Ramkali) అనే మహిళ, 28ఏళ్ల భోలు(Bholu) అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఒకే ఊరికి చెందిన వీరిద్దరికీ కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నారు. తొలుత ఆకర్షణగా ఉన్న వీరి పరిచయం, ఆ తర్వాత శారీరక సుఖం కోసం ఒక్కటయ్యారు. అలా కానీ పెళ్లి మాత్రం చేసుకోబోమని అంటున్నారు. కొద్ది రోజులుగా సహజీవనం చేస్తున్నట్టు చెప్పారు.
పెళ్లి జోలికి వెళ్లకుండా జీవితాన్ని ఇలాగే కొనసాగుతుంది అనుకున్నాము అని అంటున్నారు.. అయితే, భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేందుకు ఇద్దరు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ సహజీవనాన్ని (live-in relationship)ధ్రువీకరించుకునేందుకు జిల్లా కోర్టును ఆశ్రయించారు. అలా ఈ ప్రేమ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.