Happy Birthday LK Advani: 93వ వడిలోకి అడుగుపెట్టిన బీజేపీ సహ వ్యవస్థాపకుడు, అద్వానీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ, ఇతర ప్రముఖులు, రథయాత్రతో బీజేపీని పరుగులు పెట్టించిన బీజేపీ సీనియర్ నేత..
బిజెపి సహ వ్యవస్థాపకుడు, బిజెపి సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ 93వ ఏట అడుగుపెట్టారు. నేడు 92వ పుట్టిన రోజు చేసుకున్న అద్వానీకి ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా తదితరులు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు.
New Delhi, November 18: బిజెపి సహ వ్యవస్థాపకుడు, బిజెపి సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ (L. K. Advani) 93వ ఏట అడుగుపెట్టారు. నేడు 92వ పుట్టిన రోజు (Happy Birthday LK Advani) చేసుకున్న అద్వానీకి ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా తదితరులు జన్మ దిన శుభాకాంక్షలు (PM wishes Advani on 92nd birthday) తెలిపారు. అద్వానీ ఓ రాజనీతిజ్ఞుడు, దేశ దార్శనికుడు అని మోడి (Prime Minister Narendra Modi)ఈ సందర్భంగా అన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
దేశ ప్రజలు సాధికారత సాధించడంలో ఆయన అందించిన సహకారం అసాధారణమని తెలిపారు. అద్వానీకి బిజెపి పార్టీ సీనియర్లతో పాటు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అవిభక్త భారత్‌లోని కరాచీలో 1927 నవంబర్ 8వ తేదీన అద్వానీ పుట్టారు. దేశ విభజన తరువాత కరాచీనుంచి అద్వానీ కుటుంబం భారత్‌కు వచ్చి స్థిరపడింది. మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి బిజెపి ఏర్పాటు చేసి దానిని ఉన్నత స్థితికి తీసుకువెళ్లడంలో అద్వానీ విశేష కృషి చేశారు. అయోధ్యలో రామాలయం నిర్మించాలని కోరుతూ దేశవ్యాప్తంగా అద్వానీ రామ రథ యాత్ర చేపట్టారు.
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
దీనితో దేశంలో బిజెపి పట్ల ఆదరణ పెరిగింది. అప్పటికి కేవలం 2 సీట్లు మాత్రమే ఉన్న పార్లమెంటులో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని బిజెపి సత్తా చాటారు. అద్వానీ ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. గత మే నెలలో జరిగిన ఎన్నికల్లో అద్వానీ పోటీ చేయలేదు. ఇటీవల కొద్దికాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న అద్వానీ 2014నుంచి బిజెపి మార్గదర్శక మండలిలో సభ్యుడిగా ఉన్నారు.
అద్వానీనితో ప్రధాని మోడీ
ఏదైనా సూటిగా చెప్పే తత్వం అద్వానీ సొంతం. గత ఎన్నికలకు ముందు కూడా బీజేపీ పార్టీపై విమర్శలు సంధించారు. పార్టీలో ప్రజాస్వామ్యాన్నికాపాడాలని తన పార్టీ నాయకత్వాన్ని కోరారు. దేశం ముందు, పార్టీ తరువాత, చివరిగా స్వప్రయోజనం' అన్న బ్లాగ్‌లో ఆయన ఒక సందేశం ప్రచురించారు.
పార్టీ నాయకత్వం 'గతం,వర్తమానం, భవిష్యత్' పరిణామాలపై దృష్టి సారించాలని ఆయన ముక్కుసూటిగా చెప్పారు. పార్టీలో ప్రజాస్వామ్యం, ప్రజాస్వామిక సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం వుందని. ఇది పార్టీకి మాత్రమే కాక దేశ ప్రయోజనాలకు కూడా మంచిదని, ఇది బిజెపికి గర్వకారణం అవుతుందని ఆయన తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)