Haryana Shocker: కన్న కూతురిపై ఏడేళ్లుగా కిరాతక తండ్రి అత్యాచారం, హర్యానా రాష్ట్రంలోని హిసార్ నగరంలో దారుణ ఘటన, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
మహిళలపై దారుణంగా అత్యాచారానికి తెగబడుతున్నారు. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. చివరకు కన్న కూతురని కూడా చూడకుండా పశువుల్లా పైన పడి కామవాంఛలు తీర్చుకుంటున్నారు.
New Delhi, Jan 18: దేశంలో కామాంధులు వావి వరసలు మరచిపోతున్నారు.. మహిళలపై దారుణంగా అత్యాచారానికి తెగబడుతున్నారు. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. చివరకు కన్న కూతురని కూడా చూడకుండా పశువుల్లా పైన పడి కామవాంఛలు తీర్చుకుంటున్నారు. తాజాగా హర్యానా రాష్ట్రంలోని హిసార్ నగరంలో 17 ఏళ్ల కూతురిపై కన్న తండ్రి అత్యాచారానికి (Haryana Shocker) పాల్పడుతునట్లు పోలీసులు గుర్తించారు.
గత ఏడేళ్లుగా ఆమెపై ఈ దారుణానికి ఒడిగడుతూ.. మానసికంగా, శారిరకంగా హింసించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో యువతి పలుమార్లు గర్భం రావడంతో దానిని తండ్రి బలవంతంగా తీయించినట్లు (abortions) తెలిపారు. అంతేగాక 11 ఏళ్లు ఉన్న మరో కూతురిపై కూడా నిందితుడు లైంగిక వేధింపులకు (Man Arrested For Raping Daughter For 7 Years) పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై ఇటీవల బాధితురాలు హిసార్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
బాధితురాలు మాట్లాడుతూ.. గత ఏడేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లు వాపోయింది. ఈ దారుణాన్ని ప్రతిఘటించినప్పుడు తనను చంపేస్తానని బెదిరించినట్లు పేర్కొంది. బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.
ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకొని హిసార్ పోలీసులు నిందితులపై 376 (2) (పదేపదే అత్యాచారం), 376 (2) ఎఫ్ (ఒక సంరక్షకుడిపై అత్యాచారం), 313 (మహిళ అనుమతి లేకుండా గర్భస్రావం కలిగించడం), 506 (క్రిమినల్ బెదిరింపు), 323 (స్వచ్ఛందంగా బాధ కలిగించేది) మరియు భారతీయ శిక్షాస్మృతి యొక్క 354-ఎ (1) (స్పష్టమైన లైంగిక ప్రవర్తనలు)లతో పాటు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.