Hathras Gangrape: హత్రాస్ బాధితురాలిదే తప్పంటూ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు, సిట్ కాల పరిమితిని మరో 10 రోజులు పొడిగించిన యోగీ సర్కారు
అయితే బుధవారంతో సిట్ దర్యాప్తు ముగియాల్సి ఉంది. కానీ ప్రభుత్వం మరో పది రోజుల పాటు దర్యాప్తు గడువును పెంచింది. మరింత లోతుగా దర్యాప్తు చేయడానికే ఈ గడువును పెంచినట్లు ప్రభుత్వ వర్గాలు (Yogi Govt) పేర్కొంటున్నాయి. హాత్రాస్ ఘటన (Hathras Gangrape Case) నేపథ్యంలో నిజా నిజాలను నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం హొంశాఖ కార్యదర్శి భగవాన్ స్వరూప్ నేతృత్వంలో ‘సిట్’ ను ఏర్పాటు చేసింది. ఇందులో మరో ఇద్దరు సభ్యులు కూడా ఉన్నారు.
Lucknow, October 7: హాత్రాస్ ఘటనపై (Hathras Gangrape) ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’ (SIT) కాల పరిమితిని ప్రభుత్వం మరో పది రోజుల పాటు పొడగించింది. అయితే బుధవారంతో సిట్ దర్యాప్తు ముగియాల్సి ఉంది. కానీ ప్రభుత్వం మరో పది రోజుల పాటు దర్యాప్తు గడువును పెంచింది. మరింత లోతుగా దర్యాప్తు చేయడానికే ఈ గడువును పెంచినట్లు ప్రభుత్వ వర్గాలు (Yogi Govt) పేర్కొంటున్నాయి. హాత్రాస్ ఘటన (Hathras Gangrape Case) నేపథ్యంలో నిజా నిజాలను నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం హొంశాఖ కార్యదర్శి భగవాన్ స్వరూప్ నేతృత్వంలో ‘సిట్’ ను ఏర్పాటు చేసింది. ఇందులో మరో ఇద్దరు సభ్యులు కూడా ఉన్నారు.
ఇదిలా ఉంటే హాత్రాస్ బాధితురాలిపై బీజేపీ నాయకుడు రంజిత్ బహదూర్ శ్రీవాస్తవ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. హాత్రాస్ బాధిత యువతికి నిందితుడితో సంబంధం ఉందని,నేరం జరిగిన రోజు యువతే నిందితుడిని మొక్క జొన్న చేనుకు పిలిచిందని బీజేపీ నేత ఆరోపించారు. నలుగురు నిందితులు అమాయకులని, బాధిత యువతి అవారా అని రంజిత్ దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. కాగా వివాదాస్పద బీజేపీ నేత రంజిత్ బహదూర్ శ్రీవాస్తవపై ఇప్పటికే 44కి పైగా క్రిమినల్ కేసులున్నాయి. గతంలో శ్రీవాస్తవ సీతాపూర్, లక్నో, యూపీలో పలు మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు అతనిపై 44 క్రిమినల్ కేసులు నమోదైనాయి.
సోషల్ మీడియాలో వైరల్ అయిన శ్రీవాస్తవ వీడియోలో బాధితురాలు నిందితుడిని ప్రేమించినందున ఆమె అతన్ని పొలాల్లోకి పిలిచిందని ఆరోపించారు. అవారా యువతులు చెరకు, మొక్కజొన్న, జొన్న పొలాల్లో పొదలు, అడవుల్లో మరణిస్తూ కనిపిస్తుంటారని ఆయన ఆరోపించారు. హాత్రాస్ నిందితులను సీబీఐ చార్జిషీటు దాఖలు చేసే వరకూ జైలు నుంచి విడుదల చేయాలని శ్రీవాస్తవ కోరారు. నిందితులు నిర్దోషులని అన్నారు. ఇదిలా ఉంటే హాత్రాస్ బాధితురాలిపై తీవ్రమైన ఆరోపణలు చేసిన బీజేపీ నేత శ్రీవాస్తవకు జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖాశర్మ నోటీసు పంపుతానని చెప్పారు.