B Sriramulu Comments: చీటింగ్‌లో నేను పీహెచ్‌డీ చేశా! సంచలన వ్యాఖ్యలు చేసిన కర్ణాటక మంత్రి శ్రీరాములు, టెన్త్‌లో చీటింగ్ చేసి పాసయ్యా అంటూ విద్యార్ధులకు పాఠాలు

పరీక్షలు రాసే సమయంలో చీటింగ్ చేసే సబ్జెక్టులో నాకు పీహెచ్‌డీ (PhD on the subject of cheating) ఉన్నదని చెప్పాను’ అని మంత్రి శ్రీరాములు తెలిపారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

B Sriramulu (Photo Credits: Facebook)

Bengaluru, DEC 11: ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన రాజకీయ నాయకులు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. మంచి మాటలతో పిల్లల భవిష్యత్ తరాలకు బాటలు వేయాల్సిన ఓ మంత్రి...ఏకంగా వారికి పరీక్షల్లో కాపీ కొట్టడం గురించి లెక్చర్లు ఇచ్చారు. ఎగ్జామ్‌లో చీటింగ్ ఎలా చేయాలో వివరంగా చెప్పారు కర్ణాటకకు చెందిన మంత్రి శ్రీరాములు( B Sriramulu). అంతేకాదు చీటింగ్‌లో తనకు పీహెచ్‌డీ (PhD) ఉందంటూ కామెంట్ చేశారు. కర్ణాటక బళ్లారీ జిల్లాలో విద్యార్థులతో మాట్లాడిన ఆయన....  తన ప్రసంగంలో ఆయన పదో తరగతి పరీక్ష ఎలా ఉత్తీర్ణుడయ్యాడో వివరించారు. ‘ప్రతి రోజు ట్యూషన్‌లో నాకు అవమానమే జరిగేది. నాకే ఏదీ చేతకాదని అనేవారు. కానీ, నేను పదో తరగతి పాస్ కాగానే మా టీచర్ ఆశ్చర్యంలో మునిగారు. అప్పుడు నేను మా టీచర్‌తో ఇలా అన్నాను. పదో తరగతి పరీక్షలను నేను చీటింగ్ చేసి పాస్ అవ్వడమే కాదు.. పరీక్షలు రాసే సమయంలో చీటింగ్ చేసే సబ్జెక్టులో నాకు పీహెచ్‌డీ (PhD on the subject of cheating) ఉన్నదని చెప్పాను’ అని మంత్రి శ్రీరాములు తెలిపారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Adesh Gupta Quits: ఢిల్లీలో బీజేపీకి భారీ షాక్, ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్షుడి రాజీనామా, తదుపరి అధ్యక్షుడిపై కొనసాగుతున్న కసరత్తు 

పిల్లలకు మంచి మాటలు చెప్పాల్సిన మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రతిపక్షనేతలు అంటున్నారు. అయితే  కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి కాంగ్రెస్ లీడర్, మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ పై అసభ్య పదజాలం వాడిన తర్వాతి రోజు తాజాగా మంత్రి బి శ్రీరాములు ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో కర్ణాటకలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు నేతలు.



సంబంధిత వార్తలు

Union Budget 2025-26: వేత‌న‌జీవుల‌కు త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్, రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు ట్యాక్స్ మిన‌హాయింపు ఇచ్చే యోచ‌న‌లో కేంద్రం, ఈ బడ్జెట్ లో బొనాంజా ప్ర‌కటించే ఛాన్స్

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.