Head Constable Dies by Suicide: మహబూబాబాద్ కలెక్టరేట్ లో విషాదం.. గన్ తో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. వీడియో వైరల్
కలెక్టరేట్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ గుండెబోయిన శ్రీనివాస్ (56) గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Hyderabad, Oct 14: మహబూబాబాద్ లో విషాదం నెలకొంది. కలెక్టరేట్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ (Head Constable) గుండెబోయిన శ్రీనివాస్ (56) గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే.. హెడ్ కానిస్టేబుల్ గుండెబోయిన శ్రీనివాస్ మహబూబాబాద్ కలెక్టరేట్ లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం నాటు ట్రెజరీ స్ట్రాంగ్ రూమ్ వద్ద విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ ఉన్నట్టుండి.. తన దగ్గర ఉన్న ఎస్‌ఎల్‌ఆర్ గన్ తో గుండెపై కాల్చుకున్నాడు. తుపాకీ పేలుడు శబ్దం విన్న సహోద్యోగులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
Head Constable Dies by Suicide
కారణం అదేనా?
శ్రీనివాస్ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని చెప్తున్నారు. అయితే, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.