Hyd, Oct 13: చీఫ్ విప్ గా మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధం. ? అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన హరీశ్..
కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుందన్నారు. బిల్ పాస్ చేయించడం, ప్రభుత్వ బిజినెస్ జరిగేలా చీప్ విప్ బాధ్యత...మహేందర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి విప్ ఇష్యూ చేస్తాడు?.. అధికార పార్టీ సభ్యులకా... ప్రతి పక్ష పార్టీ సభ్యులకా అని ప్రశ్నించారు.
ఆయన విప్ జారీ చేస్తడా.. లేక బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన విప్ ను పాటిస్తాడా...విప్ అనే వ్యక్తి తన పార్టీ ఆదేశాలనుసారం నడుచుకోమని జారీ చేసేది విప్ అన్నారు. ఎదుటి పార్టీ వారిని చీప్ విప్ చేస్తే ఏ పార్టీకి విప్ జారీ చేస్తాడు ఆలోచించాలన్నారు. బిఆర్ఎస్ పార్టీ విప్ ప్రస్తుత చీఫ్ విప్ కు విప్ జారీ చేసే పరిస్థితి వచ్చింది...రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన, రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని ఎందుకు ఇది మరో ఉదాహరణ అన్నారు.
పిఎసి, చీప్ విప్ ఎంపిక విషయాల్లో ఇది స్పష్టంగా అర్థమవుతుందని...శాసనసభ సమావేశాలు ముగిసే నాటికి బిఆర్ఎస్ పార్టీ సభ్యుల సంఖ్య 38 అని స్పీకర్ గారే చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ వారు కూడా చెప్పారు అన్నారు. అలా చెప్పి మళ్లీ మా పార్టీ వాళ్లు కాదు అని మాట్లాడుతున్నారు....బిఆర్ఎస్ పార్టీ 38 మంది అని వాళ్లే చెప్తారు, మళ్ళీ మా వాళ్లు కాదు చెబుతారు అన్నారు.
చైర్మెన్ గారి దగ్గర మహేందర్ రెడ్డి గారి అనర్హత పిటిషన్ పెండింగ్ లో ఉంది. ట్రిబ్యునల్ ఛైర్మన్ గా దాని మీద నిర్ణయం తీసుకోవాలి....
ఇలాంటి సమయంలో అధికార పార్టీ చీఫ్ విప్ గా అదే కౌన్సిల్ చైర్మన్ బులిటెన్ ఎలా ఇష్యూ చేస్తారు అన్నారు. ఆయన అనర్హత పిటిషన్ లో చైర్మన్ ఇచ్చిన బుల్ టెన్ ఇంప్లీడ్ చేస్తాం...మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తరపున ఎన్నికల్లో ప్రచారం చేశాడు అన్నారు. మంత్రివర్గ విస్తరణ ఆశావాహులకు నిరాశేనా...సీఎం రేవంత్ రెడ్డి మనస్సులో ఏముంది...ఈ దీపావళికైనా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
పార్టీ ఫిరాయింపు చేశాడని స్పష్టంగా అర్థమవుతుంది....మార్చి 15 నాడు చీఫ్ విప్ అని ఆర్డర్ ఇస్తే.. పంద్రాగస్టు, జూన్ 2, సెప్టెంబర్ 17 ఎమ్మెల్సీ గా జెండా ఎగురేస్తారని జి ఏ డి అఫీషియల్ జీవో ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. అనర్హత వేటు వేయాల్సిన కౌన్సిల్ ఛైర్మన్ స్వయంగా .. పట్నం మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఎంపికైనట్లు బులెటిన్ ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధం అన్నారు.
పట్నం మహేందర్ రెడ్డి అనర్హత పిటిషన్ కౌన్సిల్ ఛ్మైరన్ దగ్గర పెండింగ్ లో ఉంది...రేవంత్ హాయాంలో రాజ్యంగం ఎలా ఖూనీ జరుగుతుందనే దానికి ఇదొక ఉదాహరణ అన్నారు. పీఏసీ చైర్మన్ పదవి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే వ్యవహరించింది...అరికెపూడి గాంధీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని స్వయంగా సీఎం, మంత్రులు చెప్పారు..పట్నం మహేందర్ రెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తి? ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.