Health Tips: ముఖం పైన మచ్చలు, ముడతలు పోయి చంద్రబింబం లాగా మెరవాలంటే ఈ చిట్కాలు పాటించండి..
ముఖ్యంగా మొహం పైన ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మన చర్మ సంరక్షణను కాపాడుకోవడం కోసం కొన్ని రకాలైనటువంటి రెమెడీస్ ఈ చలికాలంలో మొహాన్ని అందంగా ఉంచుకోవచ్చు.
చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పగులుతూ ఉంటుంది. ముఖ్యంగా మొహం పైన ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మన చర్మ సంరక్షణను కాపాడుకోవడం కోసం కొన్ని రకాలైనటువంటి రెమెడీస్ ఈ చలికాలంలో మొహాన్ని అందంగా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా చాలామంది మచ్చలు, మొటిమలు అంటే సమస్యతో కూడా బాధపడుతుంటారు. అటువంటి వారి కోసం కూడా ఈరోజు మనం కొన్ని టిప్స్ తెలుసుకుందాం.
బొప్పాయ ఫేస్ ప్యాక్- బాగా పండిన బొప్పాయి పండును మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని అందులో విటమిన్ ఈ ఆయిల్ ను రెండు చుక్కలు వేసి మొహానికి అప్లై చేసుకొని 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కున్నట్లయితే ఈ చలికాలంలో వచ్చే దురద, చర్మం, పగుళ్ళడం, మచ్చలు మొటిమలు అన్నీ కూడా తగ్గిపోయి ముఖం చంద్రబింబంలాగా మెరుస్తుంది.
అలోవెరా- అలోవెరా జెల్ కూడా మచ్చలు మొటిమలు తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చలికాలంలో మొహం చాలా డ్రైగా అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో మన చర్మానికి అలోవెరా జెల్ తేమను అందిస్తుంది. ఎక్కువసేపు హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. రెండు చుక్కల బాదం నూనెను కలిపి మొహానికి అప్లై చేసుకొని అరగంట తర్వాత చల్లటి నీటితో కడుక్కున్నట్లయితే మీ మొహం పైన ఉన్న జిడ్డు మచ్చలు మొటిమలు అన్ని తగ్గిపోయి మొహం నిగారింపును సంతరించుకుంటుంది.
Health Tips: ఎండుద్రాక్ష నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా ...
బంగాళాదుంప పేస్ట్.. బంగాళదుంప మన చర్మం పైన ఉన్న మృత కెనాలను తొలగించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మాన్ని నిగారింపుకు బంగాళదుంప సహాయపడుతుంది. బంగాళాదుంప పేస్టుని మొహం పైన అప్లై చేసుకొని ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కున్నట్లయితే మొహం పైన ఉన్న మచ్చలు, మొటిమలు, డార్క్ సర్కిల్స్ వంటివి కూడా పూర్తిగా తగ్గిపోతాయి. మీ అందాన్ని రెట్టింపు చేయడానికి బంగాళదుంప సహాయపడుతుంది.
కాఫీ పౌడర్- కాఫీ పౌడర్ కూడా మన టాన్ ను తగ్గిస్తుంది. అంతేకాకుండా మన శరీరం పైన పేర్కొన్న మలినాలను తొలగించడానికి కాఫీ పౌడర్ సహాయపడుతుంది. అంతే మొహం పైనే కాకుండా మెడ పైన కూడా చాలామందికి నల్లగా మారుతుంది. అటువంటివారు కాఫీ పౌడర్ ను కొద్దిగా తేనె వేసుకొని దాని పేస్టు మొహానికి మెడకు అప్లై చేసుకొని అది డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో కడుక్కున్నట్లయితే మొహం పైన ఉన్న మచ్చలు, మొటిమలు మెడ పైన ఉన్న నలుపు పూర్తిగా తొలగిపోతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి