Health Tips: డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ పదార్థాలను మీరు ఆహారంలో భాగం చేసుకుంటే షుగర్ ఎప్పుడు కంట్రోల్ లో ఉంటుంది..

డయాబెటిస్తో బాధపడేవారు వారి రక్తంలోని చక్కర స్థాయిలో తగ్గించుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

sugar

ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా మధుమేహ సమస్యతో అందరూ పడుతున్నారు. డయాబెటిస్తో బాధపడేవారు వారి రక్తంలోని చక్కర స్థాయిలో తగ్గించుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లేకపోతే ఒక్కొక్కసారి వీరికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా కిడ్నీలు, గుండెజబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీరు తీసుకునే ఆహారంలో కొన్ని కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకున్నట్లైతే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

నేరేడు గింజల పొడి- నేరేడు గింజల పొడి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇది షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇన్సూరెన్స్ కూడా పెంచుతుంది. డయాబెటిస్తో బాధపడేవారు నేరేడు గింజల పొడిని ప్రతిరోజు తీసుకున్నట్లయితే వీరి షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

పసుపు- పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచుతుంది. పసుపులో కర్క్యూమిని అనేది ఉంటుంది. ఇది డయాబెటిస్ ద్వారా వచ్చే కొన్ని జబ్బులను తగ్గించడానికి సహాయపడుతుంది. మధుమేహ సంస్థ బాధపడేవారు పసుపు పాలు తీసుకున్నట్లయితే షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది.

మెంతులు- మెంతి గింజల నీరు తాగడం వల్ల టైప్ టు డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపు నొప్పి జీర్ణ క్రియలను తగ్గిస్తుంది కొన్ని మెంతులు తీసుకొని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత వడకట్టుకొని ఖాళీ కడుపుతో మెంతి గింజలు మీరు త్రాగడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.

Health Tips: కండరాల నొప్పులతో బాధపడుతున్నారా..

ధనియాలు- ధనియాలు కూడా మధుమేహాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే కొన్ని రసాయనాల వల్ల హైపోగ్లస్మిక్ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఇది రక్తంలోని చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది. ధనియాలు పొడిని తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది డయాబెటిక్ రోగులకు చాలా మంచిది ఒక గ్లాసు నీటిలో ధనియాలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత తాగినట్లయితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది.

దాల్చిన చెక్క- దాల్చిన చెక్క చెప్పాలంటే నిజంగా మధుమేహ వ్యాధి ఉన్నవారికి చక్కటి ఔషధంగా చెప్పవచ్చు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలో అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా మన శరీరంలో పేర్కొన్న చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా ఇది చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. దాల్చిన చెక్కను దోరగా వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఒక గ్లాసు నీటిలో చిటికెడు దాల్చిన చెక్కగా పొడిని వేసుకొని ప్రతిరోజు తీసుకున్నట్లయితే మీకు డయాబెటిస్ సమస్య నుంచి బయటపడతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి



సంబంధిత వార్తలు

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.