Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా, అయితే గుమ్మడికాయ రసాన్ని పరగడుపున తాగితే చక్కటి ఫలితాలు.
వారు ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ వారి బరువును తగ్గించుకోవడం కష్టంగా మారింది.
ఈ మధ్యకాలంలో చాలామంది తరచుగా బరువు పెరిగే సమస్యతో బాధపడుతూ ఉన్నారు. వారు ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ వారి బరువును తగ్గించుకోవడం కష్టంగా మారింది. ఆహారంలో మార్పు ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉండడం ద్వారా కూడా వీరిలో అధిక బరువు అనే సమస్య రోజురోజుకు పెరుగుతుంది. అధిక బరువుతో బాధపడేవారు గుమ్మడికాయ రసాన్ని తీసుకున్నట్లయితే తొందరగా బరువు తగ్గుతారు. అది ఏ విధంగానో ఇప్పుడు తెలుసుకుందాం.
గుమ్మడికాయ రసం బరువు తగ్గించే విధానం- గుమ్మడి రసంలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో క్యాల్షియం, ఐరన్, ఫైబర్, మెగ్నీషియం ,విటమిన్ సి వంటి మూలకాలు పుష్కలంగా ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం ద్వారా ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది. ఎక్కువసేపు తినకుండా ఉండేలాగా ఉంచుతుంది. కాబట్టి బరువు తగ్గుతారు.
Health Tips: నువ్వుల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు
తయారీ విధానం- గుమ్మడికాయని తీసుకొని వాటి పైన తొక్కుని తీసేసి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకొని కొన్ని వాటర్ కలుపుకుంటే గుమ్మడికాయ రసం సిద్ధమైనట్లే దీన్ని తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది.
ఈ సమయంలో తీసుకోవాలి- గుమ్మడికాయ రసాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం చాలా ఉత్తమం. దీన్ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం ద్వారా ఇందులో ఉన్న పోషకాలని మన శరీరానికి అందుతాయి. అంతేకాకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఇతర ఆరోగ్య ప్రయోజనాలు..
గుమ్మడికాయ రసాన్ని తీసుకోవడం ద్వారా మలబద్ధకం వంటి సమస్య తగ్గిపోతుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం ద్వారా మలబద్ధకంతో బాధపడే వారికి ఇది చక్కటి రెమిడిగా చెప్పవచ్చు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీన్ని తీసుకుంటే మీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. ఇది క్యాన్సర్ రోగులకు చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. దీన్ని తీసుకోవడం ద్వారా క్యాన్సర్ పెరుగుదల నియంత్రణలో ఉంటుంది. జీర్ణవ్యవస్థకు చాలా మంచిది ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం ద్వారా కడుపునొప్పి, కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడే వారికి ఈ గుమ్మడికాయ రసాన్ని తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
శరీరంలో అనేక రకాల వాపులను నొప్పులను తగ్గిస్తుంది..
శరీరంలో ఉన్న నొప్పులను వాపులను ఇన్ఫర్మేషన్ తగ్గించడంలో గుమ్మడి రసం సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో ఉన్న వాపులు నొప్పులు అన్ని తగ్గిపోతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి