Health Tips: పీరియడ్స్ రెగ్యులర్ గా రావట్లేదా, అయితే ఈ చిట్కాలతోటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు పరిష్కారం లభిస్తుంది.
కొన్నిసార్లు కొన్ని అనారోగ్య సమస్యల వల్ల స్త్రీలలో ఈ పీరియడ్స్ ఎక్కువ లేదా తక్కువగా అవుతూ ఉంటాయి. అంతేకాకుండా కొన్నిసార్లు లేటుగా పీరియడ్స్ వస్తాయి.
స్త్రీలలో రుతుక్రమం అనేది చాలా సహజమైన ప్రక్రియ. కొన్నిసార్లు కొన్ని అనారోగ్య సమస్యల వల్ల స్త్రీలలో ఈ పీరియడ్స్ ఎక్కువ లేదా తక్కువగా అవుతూ ఉంటాయి. అంతేకాకుండా కొన్నిసార్లు లేటుగా పీరియడ్స్ వస్తాయి. ఈ సమస్య ముఖ్యంగా స్త్రీలలో అనేక ఇబ్బందులు గురిచేస్తుంది. కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు సంకేతంగా కూడా చెప్పవచ్చు. అయితే దాని వెనకున్న కారణాలు నివారణ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పీరియడ్స్ ఇర్ రెగ్యులర్ గా రావడానికి కారణాలు.
కొంతమందిలో పిరియడ్స్ లేటుగా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా చాలా తక్కువగా కూడా రుతుక్రమం అవుతూ ఉంటుంది. వీటినే లైట్ పిరియడ్స్ అని అంటాము. ఒకటి రెండు రోజులు మాత్రమే ఉంటుంది. దీనికి కారణాలు తెలుసుకున్నట్లయితే జీవనశైలిలో మార్పు శరీరంలో కొన్ని పోషకాలు లోపము ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది.
Health Tips: అశ్వగంధ లో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
బరువు తగ్గడం- బరువు తగ్గడం కూడా మహిళల పీరియడ్స్ సైకిల్ పైన ప్రభావితం చూపిస్తుంది. ఎక్కువగా వ్యాయామం చేసేవారిలో ఈ లేట్ పీరియడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఇవి తక్కువగా రావడం వంటి సమస్య కూడా ఏర్పడుతుంది.
చిట్కాలు.
బొప్పాయ- బొప్పాయి పండును ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఈస్ట్రోజన్ హార్మోన్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రుతు సమస్యల నుండి బయటపడేస్తుంది. ఆహారంలో బొప్పాయిని పీరియడ్స్ కు ముందు తీసుకున్నట్లయితే మీకు పీరియడ్స్ లేట్ అవ్వవు.
అల్లం- అల్లం తీసుకోవడం ద్వారా మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య తగ్గుతుంది. మహిళలు పీరియడ్స్ కు ముందు అల్లం టీ ని తీసుకున్నట్లయితే పీరియడ్స్ లేట్ అయ్యే సమస్య తగ్గుతుంది.
దాల్చిన చెక్క- దాల్చిన చెక్కలు అనేక పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది రుతుక్రమాన్ని సరైన సమయంలో వచ్చేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా పిసిఒఎస్ పిసిఒడి వంటి సమస్యలు తగ్గించడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది. పీరియడ్స్ సమయంలో దాల్చిన చెక్క టీ ని తీసుకోవడం ద్వారా పీరియడ్స్ సక్రమంగా వస్తాయి.
నువ్వులు- క్రమం తప్పకుండా పిరియడ్స్ రావాలి అంటే నువ్వులు బెల్లాన్ని కలిపి తీసుకోవాలి. ఇవి రెండూ కూడా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఒక గ్లాసు నీటిలో చెంచా బెల్లం వేసుకొని మరిగించి ఉదయాన్నే పరికడుపున తాగినట్లయితే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి