Hema Released: బెంగళూరు జైలు నుంచి విడుదలైన నటి హేమ, మీడియాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదంటూ వెళ్లిపోయిన నటి
ఇటీవల ఆమెకు స్థానిక కోర్టు షరతులతో కూడిన బెయిల్ (Hema Rleased) మంజూరు చేసింది. ఆమె నుంచి డ్రగ్స్‌ను జప్తు చేసుకోలేదని, ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు
Bengaluru, June 14: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన తెలుగు సినీనటి హేమ (Hema) జైలు నుంచి విడుదలయ్యారు. ఇటీవల ఆమెకు స్థానిక కోర్టు షరతులతో కూడిన బెయిల్ (Hema Released) మంజూరు చేసింది. ఆమె నుంచి డ్రగ్స్‌ను జప్తు చేసుకోలేదని, ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. డ్రగ్స్ (Drugs) తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు అందించలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను బెంగళూరు నేర నియంత్రణ దళం (CCB) న్యాయవాది కోర్టుకు అందజేశారు.
వాదనలను విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేశారు. ఈ క్రమంలో శుక్రవారం హేమ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈసందర్భంగా సెక్యురిటీ పోస్ట్ వద్ద ఉన్న సిబ్బంది ఆమెను కన్నడలో ప్రశ్నించగా, ‘బర్త్‌డే పార్టీ’ అంటూ సమాధానం ఇచ్చారు. మీడియాతో మాట్లాడకుండా వెళ్తే, వేరేరకంగా ఉంటుందంటూ హేమ పక్కన ఉన్న వ్యక్తి ఆమెకు సూచించారు. అయితే, ‘వీళ్లకు చెప్పాల్సిన అవసరం ఏముంది’ అనుకుంటూ హేమ అక్కడినుంచి వెళ్లిపోవడం గమనార్హం.