Hero Vida V2 E-Scooter: హీరో నుంచి ఒకేసారి మూడు ఈవీ స్కూటర్లు, ధర రూ. 96 వేల నుంచి ప్రారంభం, అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి
Vida V2 Lite, Plus, Pro అనే మూడు కొత్త వెర్షన్ Vida ఎలక్ట్రిక్ స్కూటర్‌లను హీరో విడుదల చేసింది. వీ2 లైట్ మోడల్ ధర రూ. 96 వేలు కాగా, దీని రేంజ్ 94 కిలోమీటర్లు. వీ2 ప్లస్ మోడల్ ధర రూ. 1.15 లక్షలు. దీని రేంజ్ 143 కిలోమీటర్లు.
ప్రముఖ వాహన తయారీ దిగ్గజం హీరో నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చేసింది. Vida V2 Lite, Plus, Pro అనే మూడు కొత్త వెర్షన్ Vida ఎలక్ట్రిక్ స్కూటర్‌లను హీరో విడుదల చేసింది. వీ2 లైట్ మోడల్ ధర రూ. 96 వేలు కాగా, దీని రేంజ్ 94 కిలోమీటర్లు. వీ2 ప్లస్ మోడల్ ధర రూ. 1.15 లక్షలు. దీని రేంజ్ 143 కిలోమీటర్లు. ఇక హైఎండ్ మోడల్ అయిన వీ2 ప్రొ మోడల్ ధర రూ. 1.35 లక్షలు. ఒకసారి చార్జ్ చేసి ఏకంగా 165 కిలోమీటర్లు వెళ్లి రావొచ్చు. కాగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ల ప్రారంభంతో, హీరో 1 లక్ష కంటే తక్కువ EV విభాగంలోకి ప్రవేశించింది
లైట్, ప్లస్ మరియు ప్రో మధ్య ప్రాథమిక వ్యత్యాసం బ్యాటరీ ప్యాక్‌లు. Vida V2 Lite 2.2 kWh ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది, Vida V2 Plus 3.44 kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది మరియు Vida V2 Pro 3.94 kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. బ్యాటరీలను ఇంట్లోనే రీఛార్జ్ చేసుకోవచ్చని, 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 6 గంటల సమయం పడుతుందని హీరో తెలిపింది.
హోండా నుంచి యాక్టివా ఈ-స్కూటర్, జనవరి నుంచి బుకింగ్స్ ప్రారంభం, పూర్తి వివరాలు ఇవిగో..
రిమూవబుల్ బ్యాటరీ సదుపాయం ఉంది. ఆరు గంటల్లో 80 శాతం చార్జింగ్ అవుతుంది. స్కూటర్ గరిష్ఠ వేగం గంటకు 90 కిలోమీటర్లు. ఒకసారి చార్జింగ్ చేస్తే 165 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే.. కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్ సిస్టం, కస్టమ్ రైడింగ్ మోడ్ వంటివి ఉన్నాయి. వీ2 లైట్ మోడల్‌లో రెండు రైడింగ్ మోడ్స్ రైడ్, ఎకో ఉండగా, వీ2 ప్లస్, వీ2 ప్రొలో నాలుగు మోడ్స్.. ఎకో, రైడ్, స్పోర్ట్, కస్టమ్ ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టవీఎస్ ఐక్యూబ్ 2.2, బజాజ్ చేతక్ 290, ఎంపేర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు ‘విడా వీ2’ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.