Hassan Nasrallah Death: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మ‌ర‌ణ‌వార్త‌ను ధృవీక‌రించిన సంస్థ‌, పోరాటం కొన‌సాగుతుంద‌న్నహిజ్బుల్లా

లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తమ చీఫ్ హసన్ నస్రల్లా (Hassan Nasrallah) మరణించినట్లు హిజ్బుల్లా ధృవీకరించింది. బీరూట్‌లోని గ్రూప్ ప్రధాన కార్యాలయంపై జరిగిన భారీ దాడిలో హసన్ నస్రల్లాతోపాటు (Hezbollah Chief Hassan Nasrallah) మరో టాప్ కమాండర్ అలీ కరాకి చనిపోయినట్లు పేర్కొంది. అయితే ఇజ్రాయెల్‌పై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హిజ్బుల్లా స్పష్టం చేసింది.

Hassan Nasrallah (Photo Credit: X/@disclosetv)

Lebanon, SEP 28: లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తమ చీఫ్ హసన్ నస్రల్లా (Hassan Nasrallah) మరణించినట్లు హిజ్బుల్లా ధృవీకరించింది. బీరూట్‌లోని గ్రూప్ ప్రధాన కార్యాలయంపై జరిగిన భారీ దాడిలో హసన్ నస్రల్లాతోపాటు (Hezbollah Chief Hassan Nasrallah) మరో టాప్ కమాండర్ అలీ కరాకి చనిపోయినట్లు పేర్కొంది. అయితే ఇజ్రాయెల్‌పై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హిజ్బుల్లా స్పష్టం చేసింది. ‘ఆపరేషన్ న్యూ ఆర్డర్’ పేరుతో చేపట్టిన దాడుల్లో శక్తివంతమైన 64 ఏళ్ల ఇస్లామిస్ట్ నాయకుడిని చంపినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం ప్రకటించింది.

Here's the Tweet

 

కాగా, లెబనాన్‌లో ఆధిపత్యమున్న హిజ్బుల్లా (Hezbollah) చాలా ఆలస్యంగా దీనిపై స్పందించింది. ‘తోటి అమరవీరులతో నస్రల్లా చేరారు’ అని అధికారికంగా ప్రకటించింది. మరో టాప్ కమాండర్ అలీ కరాకి మృతదేహంతో పాటు నస్రల్లా మృతదేహాన్ని గుర్తించినట్లు హిజ్బుల్లా అధికారి తెలిపారు. అలాగే నస్రల్లా మరణానికి సంతాపంగా హిజ్బుల్లాకు చెందిన అల్-మనార్ టీవీలో ఖురాన్ పద్యాలను ప్రసారం చేశారు.

Israel's Strikes in Lebanon: లెబ‌నాన్‌లో హిజ్బుల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు, 182 మంది మృతి, మరో 727 మందికి గాయాలు 

మరోవైపు ఇజ్రాయెల్‌ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాతో (Hassan Nasrallah) పాటు ఆయన కుమార్తె జైనాబ్ నస్రల్లా, హిజ్బుల్లా సదరన్ ఫ్రంట్ కమాండర్ అలీ కరాకి, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ డిప్యూటీ కమాండర్ అబ్బాస్ నిల్ఫోరౌషన్ కూడా మరణించారు. అయితే ఇజ్రాయెల్‌పై తమ పోరాటం కొనసాగుతుందని ఇరాన్‌ మద్దతున్న హిజ్బుల్లా స్పష్టం చేసింది. ‘పాలస్తీనా, గాజాకు మద్దతుగా లెబనాన్, దాని దృఢమైన, గౌరవమైన ప్రజల రక్షణ కోసం ఇజ్రాయెల్‌పై పోరాటాన్ని కొనసాగిస్తాం’ అని పేర్కొంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Martyr's Day 2025, Mahatma Gandhi Death Anniversary Quotes: నేడు మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన సూక్తులను ఫోటో గ్రీటింగ్స్ రూపంలో షేర్ చేయండిలా..

Martyrs' Day 2025, Mahatma Gandhi Punyatithi, Shaheed Diwas Quotes: మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మీ స్నేహితులకు, బంధుమిత్రులకు మహాత్మ గాంధీ కొటేషన్స్ షేర్ చేసి నివాళి అర్పించండి..

Andhra Pradesh: రాజమండ్రిలో దారుణం, మొబైల్ ఫోన్ కీ ప్యాడ్ మింగేసిన మహిళ, శస్త్ర చికిత్స చేస్తుండగా ఆక్సిజన్ అందక మృతి, మానసకి సమస్యలే కారణమని తెలిపిన వైద్యులు

SC Dismisses Jagan's Bail Cancellation Petition: జగన్‌ బెయిల్‌ రద్దుకు కారణాలేవీ లేవు, రఘురామ పిటిషన్ డిస్మిస్‌ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు, ఈ కేసును కేసును తెలంగాణ హైకోర్టు విచారిస్తోందని వెల్లడి

Share Now