Hijab in Kerala: సర్జరీ చేసే సమయంలో మహిళా డాక్లర్లకు హిజాబ్ ధరించే అవకాశం కల్పించండి, కేరళలో ఏడుగురు ముస్లిం విద్యార్థినుల డిమాండ్

ముస్లిం మహిళా వైద్యులు శస్త్ర చికిత్సలు చేసేటపుడు (Hijab During Surgery) తమ మతాచారాలను పాటించేందుకు అవకాశం కల్పించాలని ఏడుగురు ముస్లిం విద్యార్థినులు (medical students seek Hijab) కేరళలోని ఓ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌కు లేఖ రాశారు.

Representative image (Photo Credit- File Image)

Thiruvananthapuram, June 28: కేరళలో తాజాగా హిజాబ్ అంశం తెరపైకి వచ్చింది. ముస్లిం మహిళా వైద్యులు శస్త్ర చికిత్సలు చేసేటపుడు (Hijab During Surgery) తమ మతాచారాలను పాటించేందుకు అవకాశం కల్పించాలని ఏడుగురు ముస్లిం విద్యార్థినులు (medical students seek Hijab) కేరళలోని ఓ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌కు లేఖ రాశారు. తమ మత విశ్వాసాల ప్రకారం హిజాబ్‌ను అన్ని సందర్భాల్లోనూ ధరించడం తప్పనిసరి అని తెలిపారు.

ఆసుపత్రి, శస్త్ర చికిత్సల గదులలో (operation theatres) పాటించవలసిన నిబంధనలను అనుసరిస్తూ, తమ మతాచారాలను పాటించడం తమకు కష్టంగా మారిందని లేఖలో తెలిపారు. విదేశాల్లో యూనిఫార్మ్ హెల్త్ వర్కర్స్ ధరిస్తున్నట్లుగా ప్రత్యామ్నాయ దుస్తులను తమకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఎంబీబీఎస్ చదువుతున్న ఈ విద్యార్థినులు రాసిన లేఖలో, విదేశాల్లో లాంగ్ స్లీవ్ స్క్రబ్ జాకెట్లు, సర్జికల్ హుడ్స్ అందుబాటులో ఉంటున్నాయని తెలిపారు. వీటివల్ల తాము హిజాబ్ ధరించడానికి, అదే సమయంలో స్టెరైల్ ప్రికాషన్స్ తీసుకోవడానికి తమకు అవకాశం ఉంటుందన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో మేకలు, ఆవులు బలి ఇస్తే జైలుకే, బక్రీద్ పండుగ నేపథ్యంలో సర్క్యులర్ జారీ చేసిన బీబీఎంపీ

ఈ లేఖపై తిరువనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లైనెట్ మోరిస్ మాట్లాడుతూ, విద్యార్థినుల డిమాండ్‌పై చర్చించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ డిమాండ్‌ను ఇప్పటికిప్పుడు ఆమోదించడం సాధ్యం కాదన్నారు. ఆపరేషన్ థియేటర్లలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నామని చెప్పారు. రోగుల భద్రతకు పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. తాను ఒక్కడినే దీనిపై నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదన్నారు. తాము ఏర్పాటు చేసిన కమిటీ 10 రోజుల్లోగా ఓ పరిష్కారాన్ని సూచిస్తుందన్నారు.