Muslim Population Grew in India: భారత్‌లో ముస్లిం జనాభా పెరగడానికి కాంగ్రెస్సే కారణం, మండిపడిన బీజేపీ, ఇలా అయితే హిందువులకు దేశం ఉండదంటూ ఫైర్
1950 నుంచి 2015 వరకు హిందువుల జనాభా 7.82 శాతం క్షీణతకు కాంగ్రెస్‌దే బాధ్యత అని బీజేపీ గురువారం పేర్కొంది
భారత్ లో హిందువుల జనాభా తగ్గుతోందని, మైనారిటీల జనాభా క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అధ్యయనంలో తేలింది. 1950 నుంచి 2015 వరకు హిందువుల జనాభా 7.81 శాతం పడిపోయినట్లు ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ తన రిపోర్టులో పేర్కొన్నది. భారత్‌లో హిందువుల జనాభా తగ్గుతూ ఉండగా, మరోవైపు బౌద్ద, సిక్కు, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల జనాభా పెరుగుతూ పోయింది. ఇక పార్సీలు, జైనులు జనాభా కూడా తగ్గింది.సమీప మిత్ర దేశాల్లో మెజారిటీ మతస్తుల సంఖ్య పెరుగుతుండగా, భారత్‌లో మాత్రం ఆ జనాభా తగ్గినట్లు రిపోర్టులో తెలిపారు. దేశంలో తగ్గిపోతున్న హిందూ జనాబా, పెరుగుతున్న ముస్లిం జనాభా, సంచలన నివేదికను బయటపెట్టిన పీఎం ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్
1950 సంవత్సరంలో భారత్‌లో హిందువుల జనాభా 84.68 శాతం ఉండగా, 2015 నాటికి ఆ సంఖ్య 78.06 శాతానికి చేరుకున్నట్లు రిపోర్టులో వెల్లడించారు. మరో వైపు గడిచిన 65 ఏళ్ల కాలంలో ముస్లిం జనాభా మాత్రం 9.84 శాతం నుంచి 14.09 శాతానికి పెరిగిందని స్టడీలో పేర్కొన్నారు. మయన్మార్‌లో హిందువుల జనాభా పది శాతం పడిపోయింది. నేపాల్‌లో కూడా హిందువుల సంఖ్య 3.6 శాతం తగ్గినట్లు తెలిపారు.
భారత్‌లో మైనార్టీలకు రక్షణ పెరిగిందని, వాళ్లు ఇండియాలో సుఖంగా జీవిస్తున్నట్లు స్టడీలో వెల్లడించారు. ప్రభుత్వ విధానాలు, రాజకీయ నిర్ణయాలు, సామాజిక విధానాల వల్లే మెజారిటీ జనాభా తగ్గి, మైనార్టీ జనాభా పెరిగినట్లు అంచనా వేశారు. అయితే సమాజంలో భిన్నత్వాన్ని ప్రోత్సహించే రీతిలో ఇండియా ఉన్నట్లు స్టడీలో రచయితలు అభిప్రాయపడ్డారు.
Here's Tweet
ఈ స్టడీపై బీజేపీ పార్టీ కాంగ్రెస్ మీద వివర్శనాస్త్రాలు సంధించింది. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఇదే మనకు చేసిందని, వారిని వదిలేస్తే హిందువులకు దేశం ఉండదని మాన్సుఖ్ మాండవీయ అన్నారు. 1950 నుంచి 2015 వరకు హిందువుల జనాభా 7.82 శాతం క్షీణతకు కాంగ్రెస్‌దే బాధ్యత అని బీజేపీ గురువారం పేర్కొంది. హిందూ జనాభా తగ్గుదల గురించిన వార్తా క్లిప్‌ను పంచుకుంటూ బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు