Hong Kong Blocks WhatsApp: వాట్సాప్‌ను బ్యాన్ చేసిన హాంకాంగ్, కొత్త ఐటీ మార్గదర్శకాలు రిలీజ్, ప్రభుత్వ సంస్థల్లో గూగుల్ డ్రైవ్, వీ చాట్ యాప్‌ల తొలగింపు

భద్రతా పరమైన కారణాలతో తమ కంప్యూటర్‌లలో వాట్సాప్, వీచాట్ మరియు గూగుల్ డ్రైవ్ వంటి యాప్‌లను ఉపయోగించకుండా నిషేధం విధించింది. ఈ మేరకు నూతన ఐటీ మార్గదర్శకాలను విడుదల చేసింది.

hong-kong-blocks-whatsapp-wechat-and-google-drive-from-government-computers

Hong Kong, Oct 23:  సైబర్ సెక్యూరిటీ నేపథ్యంలో హాంకాంగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా పరమైన కారణాలతో తమ కంప్యూటర్‌లలో వాట్సాప్, వీచాట్ మరియు గూగుల్ డ్రైవ్ వంటి యాప్‌లను ఉపయోగించకుండా నిషేధం విధించింది. ఈ మేరకు నూతన ఐటీ మార్గదర్శకాలను విడుదల చేసింది.

అయితే ఒకవేళ సంబంధిత కార్యాలయాల్లో మేనేజర్ అనుమతి ఉంటే ఈ యాప్‌లను వాడుకోవచ్చు. డేటా లీక్‌లు మరియు సైబర్‌ సెక్యూరిటీ సవాళ్ల కారణంగా కంపెనీలు ఇలాంటి విధానాలను అవలంబిస్తున్నాయని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులు తెలిపారు.

హ్యాకింగ్ లో సైబర్ సెక్యూరిటీ పెను సవాల్‌గా మారిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ ఇన్నోవేషన్, టెక్నాలజీ మరియు పరిశ్రమల కార్యదర్శి సన్ డాంగ్ మంగళవారం ఒక రేడియో కార్యక్రమంలో అన్నారు. అమెరికా, చైనా ప్రభుత్వాలు కూడా తమ అంతర్గత కంప్యూటర్ వ్యవస్థల కోసం కఠిన చర్యలు తీసుకున్నాయని చెప్పారు.  లేఆప్స్ షాకింగ్ న్యూస్, ఈ ఏడాది 1,41,145 మంది ఉద్యోగులను తొలగించిన 470 కంపెనీలు, భవిష్యత్తులో మరిన్ని కోతలు పడే అవకాశం 

హాంకాంగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫెడరేషన్ గౌరవాధ్యక్షుడు ఫ్రాన్సిస్ ఫాంగ్ మాట్లాడుతూ, ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌ల ద్వారా మాల్వేర్ తన ఫైర్‌వాల్‌ను దాటవేయకుండా నిరోధించడమే ఈ పాలసీ లక్ష్యం అని అధికారులు తనకు చెప్పారని చెప్పారు. డేటా ఉల్లంఘనలకు సంబంధించిన సమస్యలను కూడా ఇది పరిష్కరించగలదని ఆయన తెలిపారు.చాలా మంది ప్రజలకు సైబర్‌ సెక్యూరిటీ అవగాహన దీనికి తోడు సమగ్ర పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైందన్నారు.