Human Sacrifice in Kerala: ఇంట్లోనే కుద్ర పూజలు చేసి ఇద్దరు మహిళల గొంతుకోసి చంపిన దంపతులు, మృతదేహాలను ముక్కలుగా నరికి ఇంటి బయట పాతిపెట్టారు, కేరళలో దారుణ ఘటన వెలుగులోకి..
మూడనమ్మకాలను నమ్మిన దంపతులు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఇద్దరు మహిళలను నరబలిచ్చారు.
Kochi, Oct 12: కేరళలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మూడనమ్మకాలను నమ్మిన దంపతులు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఇద్దరు మహిళలను నరబలిచ్చారు. ఈ దారుణ ఘటన పత్తినంతిట్ట జిల్లాలో (Human Sacrifice in Kerala) వెలుగు చూసింది. కాగా కోచిలోని కడవంతర, సమీపంలోని కాలడికి చెందిన ఇద్దరు మహిళలు లాటరీ టికెట్లు అమ్ముకుని పొట్టపోసుకునేవారు.
వీరిలో ఒకరు జూన్, మరొకరు సెప్టెంబర్ నుంచి కనిపించకుండా పోయారు. వారి సెల్ నంబర్లు, టవర్ లొకేషన్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. మహిళలిద్దరినీ పత్తనంతిట్ట జిల్లా తిరువల్లలో ఉండే మసాజ్ థెరపిస్ట్ భగావల్ సింగ్, అతడి భార్య లైలా బలి ఇచ్చినట్లు తేలింది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, సంపన్నులు కావాలంటే నరబలి తప్పదని వారి మిత్రుడైన పెరుంబవరూర్‌కు చెందిన రషీద్ అలియాస్ ముహమ్మద్ షఫీ సలహా ఇచ్చాడు. ఇతడే బాధిత మహిళలకు డబ్బు ఆశ చూపి భగావల్ సింగ్ ఇంటికి తీసుకువచ్చాడు.
కేరళలో మహిళల నరబలిపై దిమ్మతిరిగే నిజాలు, మహిళల మృతదేహాల అన్ని భాగాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఆ ఇంట్లోనే మంత్రాలు చేసి, ఒకరిని జూన్‌లో మరొకరిని సెప్టెంబర్‌లో గొంతుకోసి ( two women killed) చంపారు. అనంతరం షఫీ సాయంతో మృతదేహాలను ముక్కలుగా నరికి సొంతింటి ఆవరణలో, ఇలాంతూర్‌లో పాతిపెట్టారు. సింగ్ దంపతులతోపాటు షఫీని మంగళవారం కస్టడీలోకి (couple among three persons held ) తీసుకున్నట్లు కోచి నగర పోలీస్ కమిషనర్ నాగరాజు చకిలం పీటీఐకి చెప్పారు. కాలడికి చెందిన మహిళ ఆచూకీ తెలుసుకునే క్రమంలోనే రెండో ఘటన వెలుగు చూసిందన్నారు.వీటిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఐజీ పి.ప్రకాశ్ అన్నారు.