CJI SA Bobde: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే సంచలన వ్యాఖ్యలు, ప్రతీకారం తీర్చుకోవడమే న్యాయం చేయడం కాదు, న్యాయ విచారణ జరిగాకే శిక్షలు విధించాలి, తక్షణ న్యాయం అడగటం సరికాదన్న జస్టిస్ బాబ్డే

న్యాయం ఎప్పుడూ ప్రతీకార రూపంలో ఉండకూడదని సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ బాబ్డే అన్నారు. ఇలా ఎన్‌కౌంటర్లు చేసుకుంటూ పోతే న్యాయం రూపురేఖలు మారిపోతాయని పరోక్షంగా వ్యాఖ్యానించారు.

Chief Justice of India Sharad Arvind Bobde (Photo Credits: IANS)

Jodhpur, December 7: దిశ నిందితుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే (CJI SA Bobde) సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయం ఎప్పుడూ ప్రతీకార రూపంలో ఉండకూడదని సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ బాబ్డే అన్నారు. ఇలా ఎన్‌కౌంటర్లు చేసుకుంటూ పోతే న్యాయం రూపురేఖలు మారిపోతాయని పరోక్షంగా వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌ రాష్ట్రంలోని జయపురలో హైకోర్టు కొత్త భవనాన్ని సీజేఐ జస్టిస్‌ బాబ్డే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణ న్యాయం సాధ్యపడదని తాను భావిస్తున్నానన్నారు. న్యాయం (Justice) అనేది ప్రతీకార రూపంలో ఉంటే దాని లక్షణం కోల్పోతుందన్నారు. న్యాయ వ్యవస్థలో తప్పులు సరిదిద్దుకునే వ్యవస్థను తేవాల్సి ఉందన్నారు. కేసుల పరిష్కారానికి తప్పనిసరిగా మధ్యవర్తిత్వ వ్యవస్థ ఉండాలన్నారు.

ప్రతీకారం తీర్చుకోవడమే న్యాయం చేయడం కాదన్నారు. పగ తీర్చుకోవడం వల్ల న్యాయానికి ఉన్న గుణం పోతుందని చెప్పారు. న్యాయ విచారణ జరిగాకే శిక్షలు విధించాలన్నారు. తక్షణ న్యాయం అడగడం సరికాదని చెప్పారు. కాగా హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ దిషా నిందితుల ఎన్‌కౌంటర్ (Hyderabad Encounter) తర్వాత దేశవ్యాప్తంగా ఓ రకమైన డిమాండ్ నెలకొంది. రేప్ చేసిన వారు అందరినీ ఇలాగే ఎన్‌కౌంటర్ చేసి చంపేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

రాజస్థాన్ హైకోర్టు భవనం ప్రారంభోత్సవానికి కార్యక్రమానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే‌(Sharad Arvind Bobde)తో పాటు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ( ravi shankar prasad)కూడా వచ్చారు. రేప్ కేసుల్లో సత్వరన్యాయం జరిగేలా చూడాలని రవిశంకర్ ప్రసాద్ సీజేఐను కోరారు.

అనంతరం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థను మరింత బలోపేతం చేసి వీలైనంత త్వరగా న్యాయం చేయగలగాలి. ఆ న్యాయం ఆమోదయోగ్యంగా ఉండాలి. అలాగే కొత్త కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడం, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకునే విధానం పెరగాలని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే దిషా కేసు విషయం సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. న్యాయవాదులు జీఎస్. మణి, ప్రదీప్ కుమార్‌లు శనివారం (డిసెంబర్7, 2019) పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్ కౌంటర్ ఘటనలపై 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్ కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

పిటిషనర్లు నలుగురిని ప్రతివాదులుగా చేర్చారు. కేంద్ర హోం శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డీజీపీ, పోలీసు కమీషనర్ సజ్జనార్‌లను ప్రతివాదులుగా చేర్చారు. సమగ్ర విచారణ జరిగే విధంగా ఆదేశాలు ఇవ్వాలని, సిట్, సీబీఐ, సీఐడీ చేత దర్యాప్తు చేయించాలని కోరారు. కాగా మహారాష్ట్రలో జరిగిన ఓ ఎన్ కౌంటర్‌కు సంబంధించి సుప్రీంకోర్టు 16 మార్గదర్శకాలను ఇచ్చిన సంగతి తెలిసిందే.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif