Hyderabad Metro Good News: హైదరాబాద్ మెట్రో రైల్‌ ప్రయాణికులకు శుభవార్త, ఇక రాత్రి 11 గంటల వరకు మెట్రో, ఉదయం ఆరు నుంచి ఆరున్నకు సమయవేళలు మార్పు, ఉదయం షిఫ్టుల వారికి తప్పని ఇబ్బందులు

తెలంగాణా (Telangana) రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌(Hyderabad)లో ప్రయాణం అంటే హడలిపోవాల్సిందే. ట్రాఫిక్ జాంతో వాహనదారులు అల్లాడిపోతుంటారు. ఈ నేపథ్యంలో అందరూ మెట్రో రైలు( Hyderabad Metro Rail)ను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ మెట్రో రైళ్లు రాత్రి 9 దాటితే దొరకడం కష్టం. అయితే ఇప్పుడు అలాంటి బాధ లేదు. హైదరాబాద్ మెట్రో రైల్‌ ప్రయాణికులకు శుభవార్త వెలువడింది. ఇక నుంచి మెట్రో రైళ్లు రాత్రి 11 గంటల వ రకు నడవనున్నాయి.

Metro trains to continue late night operations (Photo-wikimedia commons)

Hyderabad, December 15: తెలంగాణా (Telangana) రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌(Hyderabad)లో ప్రయాణం అంటే హడలిపోవాల్సిందే. ట్రాఫిక్ జాంతో వాహనదారులు అల్లాడిపోతుంటారు. ఈ నేపథ్యంలో అందరూ మెట్రో రైలు( Hyderabad Metro Rail)ను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ మెట్రో రైళ్లు రాత్రి 9 దాటితే దొరకడం కష్టం. అయితే ఇప్పుడు అలాంటి బాధ లేదు. హైదరాబాద్ మెట్రో రైల్‌ ప్రయాణికులకు శుభవార్త వెలువడింది. ఇక నుంచి మెట్రో రైళ్లు రాత్రి 11 గంటల వ రకు నడవనున్నాయి.

నగరంలో సుమారు 1000 సిటీ బస్సులను ఆర్టీసీ రద్దు చేస్తున్న నేపథ్యంలో మెట్రో రైలు వేళల్లో మార్పులు చేసినట్లు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఇక నుంచి అన్ని టెర్మినళ్ల నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరి ఆఖరు స్టేషన్‌ కు 11.50 గంటలకు చేరుకుంటాయి. అలాగే ఉదయం 6 గంట లకు బదులుగా 6.30 గంటలకు మెట్రో రైళ్లు ప్రారంభమవుతాయని తెలిపారు.

రాత్రి ఆలస్యంగా ఇళ్లకు చేరుకునే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఉదయం 6 గంటలకు కాకుండా 6.30 గంటలకు మెట్రో రైళ్లు ప్రారంభమవుతాయని షాక్ ఇచ్చారు. దీనివలన ఉదయం షిఫ్ట్ ఉద్యోగాలకు వెళ్లే వారు మరింత ఆలస్యంగా వెళ్లనున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement