Hyderabad Woman Dies In Australia: భార్యను చంపి చెత్త డబ్బాలో పడేసిన భర్త, ఆస్ట్రేలియాలో దారుణహత్యకు గురైన హైదరాబాద్ మహిళ, మర్డర్ తర్వాత తాపీగా ఇండియాకు వచ్చిన నిందితుడు
కాగా, చైతన్య చెల్లెలు రాచకొండ కుషాయిగూడ పోలీసులకు కూడా సమాచారం అందించింది. హత్యకు గురైన చైతన్య ఏఎస్‌రావు నగర్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బాల్ శెట్టి గౌడ్ కుమార్తెగా పోలీసులు గుర్తించారు.
Sydney, March 10: ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ చైతన్య అలియాస్ శ్వేత దారుణ హత్యకు (Hyderabad Woman Dies) గురైంది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చైతన్యను ఆమె భర్తే చంపి చెత్త డబ్బాలో వేసినట్లు తేలింది. హత్య చేసిన భర్త అశోక్ రాజ్‌ను ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు. చైతన్య హత్య తర్వాత తన కొడుకుతో హైదరాబాద్ ఏఎస్ రావు నగర్‌లోని తన ఇంటికి వచ్చాడు అశోక్ రాజ్. అనంతరం ఆస్ట్రేలియాకు వెళ్లి విక్టోరియా పోలీస్ స్టేషన్‌లో అశోక్ లొంగిపోయాడు. వారం రోజుల క్రితం ఆస్ట్రేలియా విక్టోరియా బక్లీలో రోడ్డు సమీపంలో ఉన్న ఓ చెత్త డబ్బాలో చైతన్య మృతదేహాన్ని అతడు దాచిపెట్టాడు. కాగా, చైతన్య చెల్లెలు రాచకొండ కుషాయిగూడ పోలీసులకు కూడా సమాచారం అందించింది.
హత్యకు గురైన చైతన్య ఏఎస్‌రావు నగర్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బాల్ శెట్టి గౌడ్ కుమార్తెగా పోలీసులు గుర్తించారు. చైతన్యను భర్త ఎందుకు చంపాడన్న విషయాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాల వల్లే చైతన్య భర్త దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.