KTR: రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా, చిట్టినాయుడు రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడేది లేదన్న కేటీఆర్, రాష్ట్రంలో హౌలా సీఎం ఉన్నాడని ఆగ్రహం

ఆదిలాబాద్‌లో జరిగిన రైతు మహాధర్నాలో పాల్గొన్న కేటీఆర్... ఆదిలాబాద్‌కు వచ్చేటప్పుడు డిచ్‌పల్లి దగ్గర పోలీసుల భార్యలు రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు అన్నారు. కాంగ్రెస్ పాలనలో పోలీసుల కుటుంబాలను పోలీసులే గుంజుకుపోయే పరిస్థితి ఉంది...ఇక్కడికు వస్తుంటే ఉట్నూరులో పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారేమోనని జోగు రామన్న చెప్పారు అన్నారు.

I am ready for go to Jail says BRS Working President KTR(BRS X)

Adilabad, Oct 24:  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎక్కడికక్కడే పనులు అక్కడ ఆగిపోయినయ్ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆదిలాబాద్‌లో జరిగిన రైతు మహాధర్నాలో పాల్గొన్న కేటీఆర్... ఆదిలాబాద్‌కు వచ్చేటప్పుడు డిచ్‌పల్లి దగ్గర పోలీసుల భార్యలు రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు అన్నారు. కాంగ్రెస్ పాలనలో పోలీసుల కుటుంబాలను పోలీసులే గుంజుకుపోయే పరిస్థితి ఉంది...ఇక్కడికు వస్తుంటే ఉట్నూరులో పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారేమోనని జోగు రామన్న చెప్పారు అన్నారు.

ప్రజల కోసం, రైతుల కోసం జైలుకు పోతా.. ఎవ్వని అయ్యకు భయపడేది లేదు కానీ ప్రజలే మర్లవడి, కాంగ్రెసోళ్లను ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అన్నారు. ఆడబిడ్డలకు రూ. 2,500 ఇస్తా అని అన్నాడు. మరి మహిళలు లైన్ కట్టి పోలీస్ కేసు పెడితే...రైతులు రైతు భరోసా ఇవ్వలేదని లైన్ కట్టి రైతులు పోలీస్ కేసు పెడితే...నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాల కోసం కేసులు పెడితే ఒక్క కాంగ్రెసోడైనా మిగులుతాడా? ఆలోచించాలన్నారు.

మేము పదేళ్లు ఉన్నాం.. ఎప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయలేదు అన్నారు. పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు న్యాయంగా, ధర్మంగా నడుచుకోవాలె...ఎవరైనా ఎక్కువ చేస్తే పేర్లు రాసి పెట్టుకోండి మిత్తితో ఇస్తాం అన్నారు. పెద్ద పెద్దోళ్లను చూసినం.. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబుతోనే కొట్లాడినం...ఈ చిట్టి నాయుడు ఎంత? వీడిని చూసి మనం భయపడాల్నా? ఆలోచించాలన్నారు.

ప్రభుత్వ అధికారుల విషయంలో మళ్లీ చెబుతున్నా? చట్టం ప్రకారం నడుచుకోండి. లేదంటే మేము అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తాం అన్నారు. హైడ్రా పేరుతో హైదరాబాద్‌లో 2 వేల ఇళ్లు కూలగొట్టేందుకు వెళ్లారు... ఇళ్లు కూలగొడతా అంటే ఒక పెద్దమనిషి ఒక మాట అన్నందుకు ఒకాయనను జైల్లో పెడతారంటా అన్నారు. 100 రోజుల్లో అన్ని చేస్తా అన్నా లుచ్చా గాళ్లను జైల్లో పెట్టాల్నా, పేద ప్రజలను జైల్లో పెట్టాల్నా? చెప్పాలన్నారు. గరీబులు, రైతులు, విద్యార్థులు, నా మీద కేసులు పెడతా అంటే ఊరుకునే వాళ్లు ఎవరు లేరు అన్నారు.

మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నాయి.. మీ పక్కనే ఉన్న మహారాష్ట్రకు వెళ్లి కాంగ్రెస్ మోసాలను చెప్పండన్నారు. మొత్తం అడ్డగోలు హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను ఎట్ల మోసం చేశారో వాళ్లకు చెప్పండి...కాంగ్రెస్ లుచ్చా గాళ్లకు ఓట్లేస్తే మళ్లీ మోసం జరుగుతుదని మహారాష్ట్ర వాళ్లకు చెప్పాలె అన్నారు. ఉద్యమంలో ఆదిలాబాద్ ముందు ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఇక్కడి నుంచే అగ్గి అంటుకున్నది...ఇక్కడి ముకురా రైతులు కాంగ్రెస్ లుచ్చాలు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని రాహుల్ గాంధీకి పోస్ట్ కార్డులు రాసి.. పోస్ట్ కార్డు ఉద్యమం స్టార్ట్ చేశారు అన్నారు. బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్‌పై కాంగ్రెస్ ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ పరువు నష్టం దావా, ఎమ్మెల్యే టికెట్ల కోసం డబ్బులు తీసుకున్నారన్న కామెంట్లపై ఫైర్ 

కొమురం భీమ్ పుట్టిన గడ్డలో ఇలాంటి ఉద్యమాలు ఇంకా వస్తాయి...ఇక్కడ రైతులు రుణమాఫీ కాలేదని దిష్టిబొమ్మలు కాలబెడితే వాళ్లను జైల్లో పెడతారంట...రైతులు జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు. మాకు మీరు శక్తిని ఇవ్వండి మీకోసం మేము జైలుకు వెళ్తాం అన్నారు. కాంగ్రెస్ కంటే బీజేపీ వాళ్లు మరీ ప్రమాదకరం. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ బీజేపీ వ్యక్తే...గుజరాత్‌లో పత్తి క్వింటాలుకు రూ. 8,800 అంట.. అక్కడి కన్నా మనకు తక్కువ ఇస్తారంట అన్నారు. గుజరాత్‌కు ఒక నీతి, మనకు ఒక నీతా?,గుజరాత్‌లో కంటే తెలంగాణ పత్తి క్వాలిటీ అని పరిశ్రమ వర్గాల వాళ్లే నేను మంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు...గుజరాత్‌లో ఇచ్చినట్లే పత్తికి రూ. 8800 ఇవ్వాలె. లేదంటే కాంగ్రెస్‌పై ఎట్ల కొట్లాడుతామో బీజేపీపై అట్లనే కొట్లాడుతాం అన్నారు.

సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను స్టార్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. మరీ ఇప్పటి వరకు స్టార్ అయ్యిందా? చెప్పాలన్నారు. మోడీ రూ. 15 లక్షలు రాలేదు.. రేవంత్ రెడ్డి రూ. 15 వేలు రాలేదు...అక్కడ జుమ్లా పీఎం ఉన్నాడు. ఇక్కడ హౌలా సీఎం ఉన్నాడన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, బీసీ సబ్ ప్లాన్ అన్నాడు...మైనార్టీ, యువజన, మహిళా డిక్లరేషన్ అన్నాడు. ఎవ్వరినీ వదలకుండా మోసం చేశారు అన్నారు. ఇంకా మూడేళ్లు కొట్లాడేది ఉంది. ఆదిలాబాద్ ప్రజలు మాకు పోరాటం తొవ్వ చూపారు...రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా వచ్చే వరకు మనం పోరాటం చేయాల్సిందేనన్నారు. బోనస్ బోగస్ అయ్యింది, పత్తి రైతు చిత్తు అయ్యిండు, రైతు భరోసా దిక్కు లేదు అన్నారు.



సంబంధిత వార్తలు

Revanth Reddy-Allu Arjun Issue: అల్లు అర్జున్ వ్యవహారంలో కీలక మలుపు.. ఈ కేసుపై ఎవరూ మాట్లాడవద్దంటూ మంత్రులకు, పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు

Telangana Student Dies In US: అమెరికాలో మ‌రో తెలంగాణ విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి.. కారులో శ‌వ‌మై క‌నిపించిన యువకుడు.. బాధితుడు హ‌నుమ‌కొండ జిల్లా వాసి బండి వంశీగా గుర్తింపు

Police Angry On Allu Arjun: సినిమా వాళ్ళ బట్టలు ఊడతీస్తాం..అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తాం అని హెచ్చరించిన ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి

DGP Jitender: వారు సినిమాల్లోనే హీరోలు...బయట పౌరులే, చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న డీజీపీ జితేందర్, మోహన్ బాబుది ఫ్యామిలీ పంచాయితీ అన్న తెలంగాణ డీజీపీ