IAF Rescue in J&K: భారత జవాను తోడుంటే ఎంతటి ప్రమాదమైనా ఏం చేయగలదు? జమ్మూకాశ్మీర్ లో భీకర వరదలో చిక్కుకున్న ఇద్దరిని కాపాడేందుకు తక్షణమే రంగంలోకి దిగిన భారత వాయుసేన, తెగువ చూపి ప్రాణాలు రక్షించిన జవాను.

నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని భారత వాయుసేన అత్యంత చాకచక్యంగా రక్షించగలిగింది...

IAF rescue operation in Jammu (Photo Credits: ANI)

ఉత్తర భారతదేశంలో వరదలు పోటెతుత్తున్నాయి. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్ లోని టవి నది ఉప్పొంగి ప్రవహస్తుంది. టవీ నదిపై నిర్మాణ దశలో ఉన్న ఒక ఆనకట్ట వద్ద ఇద్దరు మనుషులు చిక్కుకుపోయారు. నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని భారత వాయుసేన అత్యంత చాకచక్యంగా  రక్షించగలిగింది.

మంగళవారం రోజున టవీ నదిలో చేపలు పట్టేందుకు ఇద్దరు జాలర్లు వెళ్లారు. అయితే నదిలో బురదతో కూడిన వరద నీరు ఒక్కసారిగా పోటెత్తింది. దీంతో ఈ ఇద్దరు జాలర్లు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు గోడను పట్టుకుని ప్రమాదకరంగా వెళాడుతున్నారు. వీరిని గమనించిన ప్రజలు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) రంగంలోకి దిగింది. అయినప్పటికీ భీకర స్థాయిలో ఉన్న ప్రవాహాంలో వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వందల సంఖ్యలో జనాలు గుమిగూడారు. అయినా ఎవరు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. హెలికాప్టర్ కోసం భారత వాయుసేనను (IAF) సంప్రదించగా తక్షణమే స్పందించిన వాయుసేన, ఆర్మీ హెలికాప్టర్ తో రంగంలోకి దిగింది. అత్యంత ధైర్యసాగాసాలతో హెలికాప్టర్ నుంచి తాడుతో కిందికి దిగిన ఒక ఆర్మీ జవాను ప్రమాదపుటంచున ఉన్న ఆ ఇద్దరి  నడుముకు తాడును బిగించి వారిని హెలికాప్టర్ లోకి ఎక్కించాడు. తాను మాత్రం అక్కడే ఉండిపోయాడు. వాయుసేన హెలికాప్టర్ వారిద్దరి తీసుకెళ్లి సురక్షితంగా ఒడ్డుకు చేరింది. ఆ తర్వాత కొద్ది సేపటికి మళ్లీ హెలికాప్టర్ రావడంతో జవాను కూడా తాడు సహాయంతో పైకి ఎక్కి, విజయవంతంగా తమ రెస్క్యూ ఆపరేషన్ ను ముగించుకొని అక్కడ్నించి వెళ్లిపోయారు.

 

ఈ సన్నివేశం అక్కడే ఉండి ప్రత్యక్షంగా చూసిన ప్రజలకు రోమాలు నిక్కబొడిచేలా చేసింది. భారత వాయుసేనను వారు ప్రశంసలతో ముంచేశారు. అత్యంత ధైర్యసాహసాలు కనబరుస్తూ ఆర్మీ జవాన్ చూపిన తెగువకు వారు హాట్సాఫ్ చెప్పారు.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif