IIT Madras Shocker: ఐఐటీ మద్రాస్ లో దారుణం, ఉరి వేసుకొని మరణించిన Phd స్కాలర్, 2023లో వరుసగా మూడో ఘటన..
మృతుడు సచిన్ కుమార్ జైన్ పశ్చిమ బెంగాల్‌కు చెందినవాడు.
మద్రాస్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 32 ఏళ్ల రీసెర్చ్ స్కాలర్ చెన్నైలోని వేలచేరిలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు సచిన్ కుమార్ జైన్ పశ్చిమ బెంగాల్‌కు చెందినవాడు. మార్చి 31న అతను వాట్సాప్ స్టేటస్ పెట్టాడని అది చూసిన అతని స్నేహితులు ఇంటికి చేరుకుని గదిలో చూడగా ఉరివేసుకుని కనిపించాడని పోలీసులు చెప్పారు.
సచిన్ మద్రాసులోని ఐఐటీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో పీహెచ్‌డీ రీసెర్చ్ స్కాలర్. 2023లో ఇది ఇక్కడ మూడో ఆత్మహత్య సంఘటన కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రధాన విద్యా సంస్థలలోని విద్యార్థులలో మానసిక ఆరోగ్యంపై సర్వేలు నిర్వహించాలని పలు డిమాండ్‌లు మొదలయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సచిన్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి వేలాచ్చేరి బ్రాహ్మణ వీధిలో ఉంటున్నాడు. మార్చి 31 మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Vastu Tips: పొరపాటున కూడా మీ పర్సులో ఈ 4 వస్తువులు ఉంచవద్దు,
IIT, మద్రాస్ ఒక సంతాప ప్రకటన విడుదల చేసింది: "మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన PhD రీసెర్చ్ స్కాలర్ మార్చి 31 మధ్యాహ్నం చెన్నైలోని వేలచ్చేరిలోని అతని నివాసంలో అకాల మరణం చెందడం మాకు చాలా బాధ కలిగించింది. ఒక ఆదర్శప్రాయమైన విద్యార్థి దూరమవడం శాస్త్ర పరిశోధన చేసే సంఘానికి పెద్ద నష్టం." అని తెలిపింది.
ఆ ప్రకటన ఇంకా ఇలా పేర్కొంది: "ఇన్‌స్టిట్యూట్ తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తుంది. మరణించిన విద్యార్థి స్నేహితులు, కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఈ తరుణంలో విద్యార్ధి కుటుంబం, గోప్యతను గౌరవించాలని సంస్థ ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తోంది. మరణించిన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను." అని తెలిపింది.