IMD Weather Forecast: 25 రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, గత మూడు నెలల్లో వరదలకు 600కు పైగా మృతి
ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) 25 రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఢిల్లీలో శుక్రవారం భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ ప్రకటించింది. దేశ రాజధానిలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున చాలా చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి.
New Delhi, August 16: దేశ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) 25 రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఢిల్లీలో శుక్రవారం భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ ప్రకటించింది. దేశ రాజధానిలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున చాలా చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి.
ఇక వాయువ్య భారతదేశంలోని జమ్మూ కశ్మీర్, లడఖ్, గిల్గిత్, ముజఫరాబాద్, పశ్చిమ రాజస్థాన్‌లలో శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఆగస్టు 21 వరకు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీతో పాటు, హర్యానా, చండీగఢ్‌లకు కూడా IMD శుక్రవారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ, హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
వచ్చే రెండు రోజులు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, జమ్మూ కశ్మీర్, లడఖ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, లక్షద్వీప్, అస్సాం, మేఘాలయలో కూడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి.హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, హిమాచల్ రాష్ట్రాల్లో నదులు ఇప్పటికే ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదులు, వాగులు, సముద్రాలకు దూరంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు.
రుతుపవనాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇవి ఉపసంహరించుకోవడానికి ఇంకా ఒక నెల సమయం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక గత 3 నెలల్లో 7 రాష్ట్రాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటం, మేఘాలు విరిగిపడటం వంటి ప్రమాదాల కారణంగా 700 మందికి పైగా మరణించారు.
ఈ సంవత్సరం వర్షాలు కేరళలోని వాయనాడ్ లో అత్యంత వినాశనానికి కారణమయ్యాయి. అక్కడ 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్‌లో 100 మందికి పైగా మరణించారు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ మరియు రాజస్థాన్‌లలో కూడా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అసోంలో వరద నీటిలో మునిగి 100 మందికి పైగా మరణించారు.