Hyd, August 15: తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని గురువారం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ తో కూడిన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.
గురువారం ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం అక్కడక్కడా కురుస్తుందని పేర్కొంది. ఈ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం, శనివారం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం, పలు ప్రాంతాల్లో కుండపోత వాన
మూడురోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతతో ఉక్కపోతతో చంపేస్తున్న హైదరాబాద్ వాతావరణం.. హఠాత్తుగా మారిపోయింది. శుక్రవారం నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్.. చుట్టుపక్కల ఏరియాల్లో భారీ వాన పడింది. క్యూములోనింబస్ మేఘాలు ముసురుకోవడంతో.. ఒక్కసారిగా ఈ పరిస్థితి నెలకొంది. సెలవు రోజు కావడంతో ట్రాఫిక్ చిక్కులు పెద్దగా లేకపోయినా రోడ్లపై నీరు పేరుకుపోవడంతో నగర వాసులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
Here's Videos
హైదరాబాద్ లో భారీ వర్షం. నగరంలోని కూకట్ పల్లి, మియాపూర్,మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో దంచి కొడుతున్న వాన. pic.twitter.com/AQIEeKYWS1
— ChotaNews (@ChotaNewsTelugu) August 15, 2024
మరో గంట పాటు హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్ష సూచనపై జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి స్పందించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. జీహెచ్‌ఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్, మధురానగర్, సనత్‌నగర్, ఈఎస్‌ఐ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, గాంధీ నగర్, కవాడీగూడ, దోమలగూడ, జగద్గిరిగుట్ట, షాపూర్, జీడిమెట్ల, బాలానగర్, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, సూరారం, బహదూర్‌పల్లి, కూకట్‌పల్లి, ఆల్వీన్‌కాలనీ, హైదర్‌నగర్, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, కేపీహెచ్‌బీ కాలనీ, ఖైరతాబాద్, లక్డీకాపూల్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, బషీర్‌బాగ్, అబిడ్స్, నాంపల్లి, కోఠి, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, చిలకలగూడ, మారేడ్‌పల్లి, మేడ్చల్, కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, గండిమైసమ్మ, మలక్ పేట్, చంపాపేట్, సైదాబాద్, చైతన్యపురి, సంతోష్ నగర్, కొత్తపేట, సరూర్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో గురువారం రాత్రి వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల డ్రైనేజీలు పొంగిప్రవహించడంతో పాటు, ట్రాఫిక్‌లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.