Vaccination in India: వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డు, ఆగస్ట్ నెలలో 18 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేసినట్లు తెలిపిన కేంద్రం, దేశంలో కొత్తగా 42,766 కరోనా పాజిటివ్ కేసులు
ఆగస్ట్ నెలలో 18 కోట్ల వ్యాక్సిన్లు వేసినట్లు (Vaccination in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఆగస్ట్ నెలలో జీ7 దేశాల్లో (G7 nations combined) వేసిన మొత్తం వ్యాక్సిన్ల కన్నా భారత్‌లో గత నెలలో వేసిన వ్యాక్సిన్లు ఎక్కువని ఈ సందర్భంగా వెల్లడించింది.
New Delhi, Sep 5: వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఆగస్ట్ నెలలో 18 కోట్ల వ్యాక్సిన్లు వేసినట్లు (Vaccination in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఆగస్ట్ నెలలో జీ7 దేశాల్లో (G7 nations combined) వేసిన మొత్తం వ్యాక్సిన్ల కన్నా భారత్‌లో గత నెలలో వేసిన వ్యాక్సిన్లు ఎక్కువని ఈ సందర్భంగా వెల్లడించింది.
కెనడా, బ్రిటన్, అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ దేశాలను జీ7 దేశాలుగా పిలుస్తారు. జీ 7 దేశాల్లో కెనడా అతి తక్కువగా 30 లక్షలు, జపాన్ ఎక్కువగా 4 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశాయి. భారత్‌లో జూన్ 21న వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా ఇప్పటివరకూ సుమారు 68 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు. డిసెంబర్ నాటికి ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
జీ7 దేశాల్లో 4 కోట్ల వ్యాక్సిన్లతో జపాన్ టాప్‌లో ఉండగా.. కెనడా కేవలం 30 లక్షల వ్యాక్సిన్లతో చివరి స్థానంలో ఉండటం ఈ ట్వీట్‌లో చూడొచ్చు. అదే సమయంలో అమెరికాలో కేవలం 2.3 కోట్ల వ్యాక్సిన్ డోసులు మాత్రమే ఇచ్చారు. జనవరి 16న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. మొత్తం 68.4 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.
Here's MY Gov Tweet
దేశంలో కొత్తగా 42,766 కరోనా పాజిటివ్ కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,29,88,673కు చేరింది. ఇందులో 4,10,048 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,21,38,092 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 4,40,533 మంది మహమ్మారి వల్ల మృతిచెందారు. కరోనా రికవరీ రేటు 97.42 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.