Hawala Racket: దక్షిణాదిన హవాలా దందా, రూ.3,300 కోట్ల స్కాం వెలుగులోకి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగం కేంద్రంగా హవాలా స్కామ్, ప్రకటన విడుదల చేసిన సీబీడీటీ

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగానికి చెందిన ప్రధాన కార్పోరేట్ సంస్థలకు లింక్ ఉన్న భారీ హవాలా రాకెట్‌(hawala racket)ను ఆదాయపు పన్ను విభాగం (Income Tax Department)బయటకు తీసుకువచ్చింది.

Income Tax Department busts hawala racket of Rs 3,300 crore involving infra firms says cbdt (Photo-PTI)

New Delhi,Novemebr 13: దేశ వ్యాప్తంగా హవాలా స్కాం వెలుగులోకి వచ్చింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగానికి చెందిన ప్రధాన కార్పోరేట్ సంస్థలకు లింక్ ఉన్న భారీ హవాలా రాకెట్‌(hawala racket)ను ఆదాయపు పన్ను విభాగం (Income Tax Department)బయటకు తీసుకువచ్చింది. ఆదాయపన్ను శాఖ అధికారులు (Income Tax Officers) రూ.3,300 కోట్ల విలువైన హవాలా రాకెట్‌ను గుర్తించినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (Central Board of Direct Taxes) ప్రకటించింది.

బోగస్ బిల్స్, హవాలా ట్రాన్సాక్షన్స్‌తో కొందరు వ్యక్తులు, కార్పోరేట్ సంస్థలు అందులో రూ.3,300 కోట్ల మేర స్వాహా చేసినట్లుగా సీబీడీటీ (CBDT) తెలిపింది. ఇందులో భాగంగా హైదరాబాదుతో పాటు ఢిల్లీ, ముంబై, పుణే, ఆగ్రా, గోవా, ఈరోడ్ (Delhi, Mumbai, Hyderabad, Erode, Pune, Agra and Goa) సహా 42 చోట్ల నవంబర్ నెల తొలివారంలో ఐటీ విభాగం అధికారులు సోదాలు చేశారు.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగం(infrastructure sector)లోని కొన్ని కార్పోరేట్ సంస్థలు బోగస్ కాంట్రాక్టులు, బిల్స్‌తో పెద్ద ఎత్తున నగదును సమకూర్చుకున్నట్లు ఈ సోదాల్లో తేలిందని పేర్కొంది. ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించిన నిధులను ఎంట్రీ ఆపరేటర్లు, లాబీయిస్టులు, హవాలా డీలర్ల ద్వారా నగదుగా మార్చుకున్నట్లుగా వెలుగు చూసిందని తెలిపింది. ఇలా నిధులు మళ్లించిన కంపెనీలు ఎక్కువగా ఢిల్లీ, ముంబైకి చెందినవిగా పేర్కొంది.

అందులో ఓ కంపెనీపై ఏప్రిల్‌లో కూడా ఐటీ అదికారులు దాడులు నిర్వహించారు. బోగస్ బిల్స్‌తో ముడిపడిన పెద్ద ప్రాజెక్టులు ప్రధానంగా సౌత్ ఇండియాలో ఉన్నట్లు తెలిపింది. వీటితో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తికి రూ.150 కోట్లకు పైగా నగదు చెల్లించిన ఆధారాలు లభించినట్లు పేర్కొంది.

బడా కార్పోరేట్ కంపెనీలు, హవాలా ఆపరేటర్ల మధ్య ఉన్న రహస్య సంబంధాలు, ఈ వ్యవహారంతో లింక్ కలిగిన చైన్ సిస్టంకు సంబంధించిన విషయాలు వెలుగు చూసినట్లు CBDT తెలిపింది. బోగస్ కాంట్రాక్టుల ద్వారా రూ.3,300 కోట్ల నిధులను మళ్లించినట్లు పేర్కొంది. వివిధ ప్రాంతాల్లో చేసిన సోదాల్లో రూ.4.19 కోట్ల బ్లాక్ మనీ, రూ.3.2 కోట్ల విలువైన గోల్డ్ స్వాధీనం చేసుకుంది. కాకపోతే ఆయా కంపెనీల వివరాలను సీబీడీటీ గోప్యంగా ఉంచింది.

‘‘సోదాలు ఫలితాన్నిచ్చాయి. బడా కార్పొరేట్లు, హవాలా ఆపరేటర్ల మధ్య ఉన్న బంధం తాలూకూ ఆధారాలు లభించాయి. బోగస్‌ కాంట్రాక్టుల ద్వారా రూ.3,300 కోట్ల మేర నిధులను కాజేసిన వ్యవహారం వెలుగు చూసింది’’అని సీబీడీటీ తన ప్రకటనలో తెలిపింది.