COVID in India: దేశంలో 5 నెలల తర్వాత ఒక్కసారిగా పెరిగిన కేసులు, గత 24 గంటగల్లో 2,151 మందికి కరోనా, కొత్తగా ఏడుగురు మృతి

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం..1,42,497 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,151 కరోనా వైరస్‌ కేసులు బయటపడ్డాయి. కాగా గత ఐదు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. గతేడాది అక్టోబర్‌ 28వ తేదీన 2,208 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Coronavirus Outbreak in China (Photo Credits: PTI)

New Delhi, Mar 29: దేశంలో గత 24 గంటల్లో కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపించింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం..1,42,497 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,151 కరోనా వైరస్‌ కేసులు బయటపడ్డాయి. కాగా గత ఐదు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. గతేడాది అక్టోబర్‌ 28వ తేదీన 2,208 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

తాజా కేసులతో దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 11,903కు ఎగబాకింది.దేశంలో కరోనా బారినపడిన వారి సంఖ్య4,47,09,676కి చేరింది. ఇప్పటి వరకు 4,41,66,925 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో (Maharastra) ముగ్గురు, కేరళ (Kerala)లో ముగ్గురు, కర్ణాటక (Karnataka)లో ఒకరు చొప్పున మొత్తం ఏడుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,848గా నమోదైంది.

నకిలీ ఫార్మా కంపెనీలపై కేంద్రం కొరడా, 18 కంపెనీల లైసెన్స్‌లు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న DCGI

ఇక ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో (Positive Cases)0.03 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రికవరీ రేటు 98.78 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.65 (220,65,76,697) కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Health ministry) వెల్లడించింది.



సంబంధిత వార్తలు

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.