Andhra Techie In Pakistan Case: 'పాకిస్థాన్ చేసిన అరెస్ట్ ప్రకటన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, రెండేళ్ల క్రితమే భారత పౌరుల మిస్సింగ్ గురించి పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చాం'! కాన్సులర్ యాక్సెస్ ఇవ్వాలని భారత్ డిమాండ్
అయితే పాకిస్థాన్ ప్రభుత్వానికి ఈ సమాచారాన్ని అందించాము అయితే పాకిస్థాన్ ....
New Delhi, November 21: ఇద్దరు భారతీయ పౌరులను పాకిస్థాన్ (Pakistan) అధికారులు అరెస్ట్ చేసిన వ్యవహారంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ (Raveesh Kumar) గురువారం స్పందించారు. 2016-17 మధ్యకాలంలో ఆ ఇద్దరు అనుకోకుండా భారత సరిహద్దును దాటి పాకిస్థాన్ లోకి ప్రవేశించారని రవీష్ కుమారు తెలిపారు. అయితే పాకిస్థాన్ ప్రభుత్వానికి ఈ సమాచారాన్ని అందించాము అయితే పాకిస్థాన్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన రాలేదు.
తాజాగా, ఆ ఇద్దరు భారతీయ పౌరులను పాకిస్థాన్ అధికారులు ఇప్పుడు అరెస్ట్ చేశామని ప్రకటన చేయటం మాకు అశ్చర్యాన్ని కలిగిస్తుందని రవీష్ అన్నారు. వెంటనే ఆ ఇద్దరు భారత పౌరుల సమాచారాన్ని తమకు ఇస్తూ సహకరించాల్సిందిగా కాన్సులర్ యాక్సెస్ కోసం అభ్యర్థిన్నామని రవీష్ కుమార్ వెల్లడించారు.
పాకిస్థాన్ అరెస్ట్ చేసినట్లు చెప్తున్న ఇద్దరు భారత పౌరుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ లోని, విశాఖపట్నంకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రశాంత్ (Prasanth Vaindam) కాగా మరొకరు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బరిలాల్ (Bari Lal) గా గుర్తించారు. ప్రేమలో విఫలమైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రశాంత్ తన ప్రేయసిని వెతుక్కుంటూ స్విట్జర్లాండ్ వెళ్లేక్రమంలో పాకిస్థాన్ లో ప్రవేశించినట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. తన కుమారుడు అమాయకుడు, ప్రేమలో విఫలమైన తర్వాత మానసికంగా స్థిరంగా లేడని ప్రశాంత్ తండ్రి బాబూరావు తెలిపారు.
కాగా, ఆ ఇద్దరు భారతీయ పౌరులను వాడుకొంటూ, పాకిస్థాన్ చేసే పబ్లిసిటీలో వారు బాధితులు కాబడలేరని తాము ఆశిస్తున్నామని, రవీష్ కుమార్ ఓ అనుమానస్పదమైన ప్రకటన చేశారు.
Here's the tweet:
ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించారని ఇద్దరు భారతీయ పౌరులైన ప్రశాంత్ వైందాం మరియు బరి లాల్ ను పాకిస్థాన్ అధికారులు అరెస్ట్ చేసి సోమవారం కోర్టులో హాజరుపరిచారని పాక్ మీడియా పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడింది.