Covid in India: తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు, గత 24 గంటల్లో 116 కేసులు నమోదు, తాజాగా ముగ్గురు మృతి, కొవిడ్-19 సబ్ వేరియంట్ జేఎన్.1పై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 116 కేసులు (India logs 116 New Covid-19 Cases) బయటపడ్డాయి.
New Delhi, Dec 26: దేశంలో కరోనా కేసులు నేడు కాస్త తగ్గుముఖం పట్టాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 116 కేసులు (India logs 116 New Covid-19 Cases) బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,170కి (active tally above 4,100) చేరింది. నిన్న ఒక్కరోజే మూడు మరణాలు నమోదయ్యాయి.
కర్ణాటకలో మహమ్మారి కారణంగా ముగ్గురు మరణించారు. దీంతో దేశంలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,33,337కి ఎగబాకింది. ఇప్పటి వరకూ కరోనా నుంచి 4,44,72,153 మంది కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా 220.67 కోట్ల (220,67,79,081) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో కొత్తగా 628 కరోనా కేసులు,కేరళలో అత్యధికంగా 3,128 కేసులు నమోదు, ముగ్గురు మృతి
ప్రస్తుతం దేశంలో కేసులు పెరుగుదలకు కొవిడ్-19 సబ్ వేరియంట్ జేఎన్.1 కారణమని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా జేఎన్.1 (JN.1) కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం వరకు ఈ తరహా కేసులు 63 నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.