T20 World Cup 2021: ఉగ్రవాదుల కాల్పుల్లో మనోళ్లు చస్తుంటే వారితో మ్యాచ్‌లా, భారత్, పాక్ మధ్య టీ 20 మ్యాచ్‌పై మరోసారి ఆలోచన చేయాలని కోరిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
దేశ సరిహద్దులో ఉద్రిక్తతలు రేగుతున్న నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ఈ నెల 24న దుబాయ్‌లో జరుగనున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌పై (India-Pak T20 World Cup Match) పునరాలోచించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కోరారు.
New Delhi, Oct 18: దేశ సరిహద్దులో ఉద్రిక్తతలు రేగుతున్న నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ఈ నెల 24న దుబాయ్‌లో జరుగనున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌పై (India-Pak T20 World Cup Match) పునరాలోచించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కోరారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు సరిగా లేనందున దీనిపై నిర్ణయం (Reconsider India-Pak T20 World Cup match) తీసుకోవాలన్నారు. ‘భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు బాగా లేనట్లయితే ఈ మ్యాచ్‌పై పునరాలోచించాలని నేను భావిస్తున్నా’ అని మీడియా ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపి హత్య చేస్తున్నారు. గత రెండు వారాల్లో 11 మంది పౌరులు ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయారు. ఈ నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఈ నెల 24న జరుగనున్న టీ 20 మ్యాచ్‌పై పునరాలోచించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. మరోవైపు దేశంలోని పలు వర్గాల నుంచి కూడా ఇలాంటి డిమాండ్ వ్యక్తమవుతున్నది. ఇదిలా ఉంటే భారత్‌తో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ భయంలేకుండా ఆడాలని ఆ జట్టు మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ సూచించాడు. దాయాదుల ఈ హైవోల్టేజ్ సమరం ఈనెల 24న దుబాయ్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. భయమెరుగకుండా, ఒత్తిడికి లోనుకాకుండా ప్రతి ఒక్కరూ సత్తామేరకు ఆడితే భారత్‌పై గెలుపు సులభమేనని మియాందాద్ అన్నాడు.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆదివారం దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాంలో జిల్లాలో ఇద్దరు వలస కూలీలను కాల్చి చంపారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వాన్‌పోలో వలస కార్మికులు ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించిన ముష్కరులు వారిపై కాల్పులు జరిపారు. ముగ్గురికి తూట గాయాలు కాగా.. ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. మృతులు రాజా రేషి దేవ్, జోగిందర్ రేషి దేవ్‌గా గుర్తించారు. వీరి స్వస్థలం బిహార్.గాయపడ్డ మరో వ్యక్తిని చున్ చున్ రేషి దేవ్‌గా గుర్తించారు. సదరు వ్యక్తిని ఆస్పత్రికు తరలించి, వైద్యం అందిస్తున్నారు.
ఆదివారం వలస కార్మికులపై జరిగిన తాజా దాడికి shadowy organisation బాధ్యత వహించింది. ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళమని వారిని కోరినప్పుడు ఇది ప్రతీకారంగా జరిగిందని పేర్కొంది.గడిచిన రెండు రోజుల్లో ఉగ్రవాదులు కాల్పులకు దిగడం ఇది మూడోసారి. బీహార్‌లోని బంకా నివాసి అయిన అరవింద్ కుమార్ సాహ్ శ్రీనగర్‌లో హత్య చేయబడ్డాడు మరియు సహరాన్‌పూర్‌కు చెందిన వడ్రంగి సాగీర్ అహ్మద్ శనివారం పుల్వామాలో కాల్చి చంపబడ్డాడు.