Coronavirus: నిన్నటితో పోలిస్తే 15శాతం పెరిగిన కరోనా కేసులు, కేరళలో తగ్గని మహమ్మారి తీవ్రత, 527 రోజుల కనిష్టానికి యాక్టీవ్ కేసులు
భారత్‌లో కొత్తగా 10, 197 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,44,66,598కు చేరాయి.
New Delhi November 17: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుతున్నప్పటికీ, నిన్నటితో పోలిస్తే కరోనా కొత్త కేసులు 15 శాతం పెరిగాయి. భారత్‌లో కొత్తగా 10, 197 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,44,66,598కు చేరాయి. ఇందులో 3,38,73,890 మంది కోలుకోగా, 1,28,555 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,64,153 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 527 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
గడిచిన 24 గంటల్లో మరో 12,134 మంది కరోనా నుంచి బయటపడగా, కొత్తగా 301 మంది మరణించారు. ఇక కొత్తగా నమోదైన కేసులు, మరణాల్లో కేరళలోనే అత్యధికం ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 5,516 కేసులు నమోదవగా, 39 మంది మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.82 శాతం ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది.