COVID in India: దేశంలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా, మొత్తం 10 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు, ఒక్క కేరళలోనే 2,669 కేసులు నమోదు, తాజాగా 328 కొత్త కేసులు

ఒక్క కేరళలోనే 2,669 కేసులు నమోదు కావడం గమనార్హం. కరోనా బారిన పడి కేరళలో ఒక వ్యక్తి మృతి చెందాడు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,33,328కు చేరింది. బిహార్‌లో మొదటిసారి రెండు కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.

Covid

దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,997కు చేరింది. ఒక్క కేరళలోనే 2,669 కేసులు నమోదు కావడం గమనార్హం. కరోనా బారిన పడి కేరళలో ఒక వ్యక్తి మృతి చెందాడు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,33,328కు చేరింది. బిహార్‌లో మొదటిసారి రెండు కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.

బిహార్‌లో నమోదైన కేసులతో దేశంలో మొత్తం 10 రాష్ట్రాల్లో కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పుదుచ్చేరిలలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలవరం, ఏపీలో రెండు, తెలంగాణలో ఆరు కేసులు నమోదు, హైదరాబాద్‌లో ఇద్దరు చిన్నారులకు కోవిడ్

కేరళలో కరోనా వేరియంట్ జేఎన్‌1 విజృంభిస్తోంది. తాజాగా దేశంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 328 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసుల్లో అత్యధికంగా 265 కేసులు ఒక్క కేరళలోనే వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెర‌గ‌డానికి కొత్త వేరియంట్ (New Covid Variant) జేఎన్‌.1 కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.



సంబంధిత వార్తలు

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.