Covid in India: దేశ రాజధానిలో కరోనా కల్లోలానికి ఏడాది పూర్తి, దేశంలో తాజాగా 15,510 మందికి కోవిడ్, ఏపీలో తాజాగా 117 మందికి పాజిటివ్, మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
అదే సమయంలో 11,288 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,12,241కు (Covid in India) చేరింది. గడచిన 24 గంటల సమయంలో 106 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,157 కు (Covid Deaths) పెరిగింది.
New Delhi, Mar 1: దేశంలో గత 24 గంటల్లో 15,510 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 11,288 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,12,241కు (Covid in India) చేరింది. గడచిన 24 గంటల సమయంలో 106 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,157 కు (Covid Deaths) పెరిగింది.
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,07,86,457 మంది కోలుకున్నారు. 1,68,627 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 1,43,01,266 మందికి వ్యాక్సిన్ (Covid Vaccine) వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 21,68,58,774 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ICMR) తెలిపింది. నిన్న 6,27,668 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
ఏపీ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 39,122 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 117 మందికి పాజిటివ్ (AP Coronavirus) అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 41 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గుంటూరు జిల్లాలో17, కృష్ణా జిల్లాలో 11, శ్రీకాకుళం జిల్లాలో 10 కొత్త కేసులు గుర్తించారు. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1, కర్నూలు జిల్లాలో 2, తూర్పు గోదావరి జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 66 మంది కోలుకోగా, ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇప్పటివరకు ఏపీలో 8,89,916 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,82,029 మందికి కరోనా నయమైంది. ఇంకా 718 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 7,169గా నమోదైంది.
దేశరాజధాని ఢిల్లీలో తొలి కరోనా కేసు (First Covid Case in Delhi) 2020, మార్చి 2న నమోదైంది.ఏడాదిలో 6.39 లక్షల మందికి కరోనా సోకింది. వీరిలో 98 శాతం మంది కరోనాను జయించారు. అయితే మొత్తం 10,910 మందిని కరోనా పొట్టన పెట్టుకుంది. కాగా ఢిల్లీలో కరోనా మూడు వేవ్‌లు కనిపించాయి. గడచిన ఏడాదిలో కరోనా కారణంగా ఎన్నో ఒడిదుడుకులను చవిచూసిన ఢిల్లీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. అయితే కొంతమంది నిర్లక్ష్యం కారణంగా ఇటీవలి కాలంలో కరోనా కేసులు తిరిగి పెరుగుతున్నాయి. ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చిన మయూర్ విహార్ నివాసి ఒకరు 2020, ఫిబ్రవరి 28న అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.
మార్చి 2న అతనికి కరోనా ఉందని తేలింది. తొలి కరోనా కేసు నమోదుతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ తరువాత కరోనా కేసులు అంతకంతకూ పెరిగాయి. నవంబరు నాటికి రోజుకు ఆరు వేలకు మించిన కేసులు నమోదవుతూ వచ్చాయి. అలాగే రోజుకు 90కి పైగా కరోనా బాధితులు కన్నుమూశారు. ఇదే సమయంలో విధించిన లాక్‌డౌన్ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం తిరిగి కరోనా కట్టడి చర్యలు ప్రారంభించింది.