Coronavirus in India: మరో కొత్త చిక్కు..ట్విండెమిక్‌గా మారుతున్న కరోనా, దేశంలో తాజాగా 18,166 మందికి కోవిడ్, కేరళలో కొనసాగుతున్న కరోనావైరస్ విజృంభణ
నిన్న 18,166 కరోనా కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,39,53,475కు పెరిగింది. అలాగే, నిన్న కరోనా నుంచి 23,624 మంది (23,624 recoveries) కోలుకున్నారు. 214 మంది ప్రాణాలు (214 deaths in the last 24 hours ) కోల్పోయారు.
New Delhi, Oct 10: దేశంలో కొత్త కరోనా కేసులు మరోసారి 20 వేలకు దిగువన నమోదయ్యాయి. నిన్న 18,166 కరోనా కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,39,53,475కు పెరిగింది. అలాగే, నిన్న కరోనా నుంచి 23,624 మంది (23,624 recoveries) కోలుకున్నారు. 214 మంది ప్రాణాలు (214 deaths in the last 24 hours ) కోల్పోయారు.దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,50,589కి చేరింది. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,32,71,915కు పెరిగింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 2,30,971 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మొత్తం 94,70,10,175 వ్యాక్సిన్ల డోసులు వినియోగించారు.
కేరళలో గత నెల రోజులుగా 10 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 9,470 కరోనా కేసులు, 101 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 47,84,109కు, మొత్తం మరణాల సంఖ్య 26,173కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 12,881 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 46,44,211కు చేరుకున్నదని, ప్రస్తుతం రాష్ట్రంలో 1,13,132 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతున్నది.
ఇక అమెరికాలో కరోనా రోగంతో పాటు సీజనల్‌గా వచ్చే ఫ్లూ (జలుబు) కూడా సోకుతోంది. ప్రస్తుతం కరోనాను పాండెమిక్ (మహమ్మారి) అని పిలుస్తున్న నేపథ్యంలో కరోనా, సీజనల్ ఫ్లూతో కలిపి ట్విండెమిక్‌గా (రెండు పాండెమిక్‌లు కలసి) మారి అక్కడి ప్రజలను వణికిస్తోంది. ఈ తరహా రూపంలో వచ్చే కేసులను ప్రస్తుతం మేథమేటికల్ మోడల్స్ ద్వారా అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కోవిడ్‌పై పోరాడేందుకు తీసుకునే చర్యలు ఫ్లూకి కూడా అడ్డుకట్ట వేస్తాయని అన్నారు.
మరోవైపు ఇంగ్లండ్‌లో గత మూడు వారాల్లో 20 లక్షల మందికి బూస్టర్ డోస్ ఇచ్చినట్లు యూకే ఆరోగ్య సంస్థ శనివారం ప్రకటించింది. కోవిడ్ నుంచి అత్యధిక ముప్పు ఉన్న వర్గాలను ఎంపిక చేసి వారికి వ్యాక్సినేషన్ ఇస్తున్నట్లు వెల్లడించింది.
.