Coronavirus in India: దేశంలో కొత్తగా 20,799 మందికి కరోనా, 24 గంటల్లో 180 మంది మృతి, ప్ర‌స్తుతం దేశంలో 2,64,458 యాక్టివ్‌ కేసులు

గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 20,799 పాజిటివ్ కేసుల‌ను న‌మోదు కాగా, 180 మంది మ‌ర‌ణించారు. మ‌రో 26,718 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు.

Coronavirus Outbreak (Photo credits: IANS)

దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 20,799 పాజిటివ్ కేసుల‌ను న‌మోదు కాగా, 180 మంది మ‌ర‌ణించారు. మ‌రో 26,718 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో 2,64,458 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,48,997 మంది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 90.79 కోట్ల‌కు పైగా టీకా డోసుల పంపిణీ జ‌రిగింది.