Coronavirus in India: వచ్చే ఏడాది మొత్తం మాస్కులు ధరించాల్సిందే, స్పష్టం చేసిన నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్, దేశంలో తాజాగా 27,176 కరోనా కేసులు, గుజరాత్‌లో 8 నగరాల్లో ఈ నెల 25 వరకు నైట్ కర్ఫ్యూ
దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,33,16,755కు (Coronavirus in India) చేరింది. ఇందులో 3,51,087 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,25,22,171 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
New Delhi, Sep 15: దేశంలో గత 24 గంటల్లో 27,176 కరోనా పాజిటివ్ కేసులు (Covid in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,33,16,755కు (Coronavirus in India) చేరింది. ఇందులో 3,51,087 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,25,22,171 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,43,497 మంది బాధితులు మృతిచెందారు. కాగా, మంగళవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 38,012 మంది కోలుకోగా, 284 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
గత 24 గంటల్లో 61,15,690 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించింది. దీంతో మొత్తం 75,89,12,277 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. దేశవ్యాప్తంగా మంగళవారం వరకు 54,60,55,796 నమూనాలకు పరీక్షలు చేశామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) వెల్లడించింది. ఇందులో నిన్న ఒక్కరోజే 16,10,829 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది.
మాస్కులు అవసరం ఇప్పుడప్పుడే తీరిపోదని, వచ్చే ఏడాదంతా కూడా మాస్కులను ధరించాల్సి ఉంటుందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ స్పష్టం చేశారు. కరోనాపై యుద్ధానికి వ్యాక్సిన్లు, ప్రభావవంతమైన ఔషధాలు, నిబంధనలు, జాగ్రత్తలు పాటించడం అవసరమని చెప్పారు. ‘మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, శానిటైజర్లు వినియోగించడం, భౌతికదూరం పాటించడాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు.
కరోనా మహమ్మారి కట్టడి కోసం గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రేపటి నుంచి ఈ నెల 25 వరకు నైట్ కర్ఫ్యూను పొడిగించాలని డిసైడ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం గుజరాత్ ప్రభుత్వం ఒక ప్రటకన చేసింది. ఈ నైట్ కర్ఫ్యూ ప్రతి రోజూ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. అయితే, రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో మాత్రమే ఈ నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఆ ఎనిమిది నగరాల్లో వడోదర, గాంధీనగర్, సూరత్, రాజ్‌కోట్ ఉన్నాయి.